https://oktelugu.com/

Kamal Haasan : కమల్ హాసన్ చేసిన ఆ ఒక్క సినిమాను చూసి రజినీకాంత్, చిరంజీవి లకు భయం పుట్టిందా..? కారణం ఏంటి..?

సౌత్ లో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ యాక్టింగ్ లో మాత్రం కమల్ హాసన్ ను మించిన నటుడు మరొకరు లేరనేది వాస్తవం...

Written By:
  • Gopi
  • , Updated On : July 25, 2024 / 07:20 PM IST
    Follow us on

    Kamal Haasan : తమిళ్ సినిమా ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో ఏలిన స్టార్ హీరోల్లో కమల్ హాసన్ ఒకరు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో చేసిన భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించలేదు. కాబట్టి ఇప్పుడు మణిరత్నంతో చేస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా మీద తన పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్లిద్దరి కాంబో లో 1987 వ సంవత్సరంలో ‘నాయకుడు’ అనే సినిమా వచ్చింది. ఇక అప్పటినుంచి వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా అయితే రాలేదు. ఇక అప్పట్లో నాయకుడు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా, ఇండియాలోనే ఆల్ టైమ్ టాప్ టెన్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి గా నిలిచిపోయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి క్రమంలోనే కమల్ హాసన్ అప్పట్లో వైవిద్య భరితమైన పాత్రలను పోషిస్తూ వచ్చాడు. ఇతను చేసిన ప్రతి పాత్రలో లీనమైపోయి నటించడమే కాకుండా తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసేవాడు…ఇక ఇదిలా ఉంటే కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ చేసిన ‘స్వాతిముత్యం ‘ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందనే చెప్పాలి. ఇక ఏం తెలియని ఒక అమాయకుడు తన కెరియర్ లో ఎలా ముందుకు వెళ్ళగలడు అనే ఒక పాత్రలో కమల్ హాసన్ పండించిన హావభావాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనే చెప్పాలి…

    ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రజినీకాంత్, చిరంజీవి లకు సైతం ఈ సినిమాను చూడగానే భయం పుట్టిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఎందుకంటే కమల్ హాసన్ ఒక మెంటల్లీ డిజార్డర్ పర్సన్ పాత్రలో నటించి కూడా సూపర్ సక్సెస్ ని కొట్టాడు అంటే అది మామూలు విషయం కాదు. ఇక అప్పటికి సౌత్ లో ఉన్న సినిమా అభిమానులందరు తమ హీరో ఫైట్లు చేయాలి, పాటలు పాడాలి, కామెడీ జోకులు చేయాలి అనుకునే స్వభావంలో ఉన్నారు. ఇక ఈ ఫార్మాట్ మొత్తాన్ని బ్రేక్ చేస్తూ కమల్ హాసన్ అసలు హీరో అనేవాడు అలా ఉండకపోయినా హిట్టు కొట్టొచ్చు అని చూపించాడు.

    దాంతో రజనీకాంత్, చిరంజీవి లు అప్పటి వరకు ఒక సినిమా కోసం కమర్షియల్ కథలను మాత్రమే ఎంచుకునేవారు. కానీ వాళ్ళను రియలైజ్ చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం…అందుకే ఈ సినిమా తర్వాత చిరంజీవి కే బాలచందర్ డైరెక్షన్ లో ‘రుద్రవీణ ‘ అనే సినిమా చేశాడు. ఆ సినిమా కంటెంట్ బేస్డ్ సినిమా అయినప్పటికీ అది పెద్దగా ఆడలేదు. కానీ చిరంజీవికి మాత్రం యాక్టింగ్ పరంగా చాలా మంచి ప్రశంసలైతే దక్కాయి. ఇక మొత్తానికైతే సౌత్ ఇండియా లో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన రజినీకాంత్, చిరంజీవి లకు భయం పుట్టించిన ఒకే ఒక్క స్టార్ హీరో కమల్ హాసన్ అనే చెప్పాలి.

    ఇక అప్పటికి ఇప్పటికీ అలాంటి పాత్రలను పోషించాలంటే అది కమలహాసన్ వల్లే అవుతుంది. ఇక అతన్ని మించిన నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక కమల్ హాసన్ ఇప్పుడు థగ్ లైఫ్, భారతీయుడు 3, విక్రమ్ 2 లాంటి వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు…