Pawan Kalyan fan among Telugu actors: పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేశాడు. అతను రాక ముందు ఉన్న ఇండస్ట్రీ లో ఉన్న సినిమాలు వేరు అతను వచ్చిన తర్వాత సినిమాల స్టైల్ చేంజ్ అయింది. తన మేనరిజమ్స్ తో ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఎప్పుడైతే ఆయన డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చాడో తెలుగు సినిమా ఇండస్ట్రీ సైతం కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగింది…ఒక జనరేషన్ మొత్తం అతని అభిమానులుగా మారిపోయారు అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ను క్రియేట్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు… ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు సైతం అతని అభిమానులుగా మారిపోయారు. ఇప్పుడున్న కొంతమంది స్టార్ హీరోలు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అయినప్పటికి బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలా చెబితే ఇతర హీరోల అభిమానులు తమ సినిమాలను చూడరేమో అనే ఉద్దేశ్యంతో బయటికి చెప్పడం లేదు. కానీ వాళ్లు మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులే అంటూ ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు.
ఇక నితిన్ పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ ఓపెన్ గా చెప్పేసాడు. ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ సైతం నేను పవన్ కళ్యాణ్ అభిమానినే అంటు పలు సందర్భాల్లో చెప్పాడు. శర్వానంద్, నవీన్ పోలిశెట్టి లాంటి నటులు మాత్రం ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులని చెప్పలేదు.
Also Read: స్టార్ హీరో కొడుకుతో సినీ నటి హేమ కూతురు పెళ్లి..? ఇదేమి మామూలు ట్విస్ట్ కాదుగా!
కానీ వాళ్లు పవన్ కళ్యాణ్ అభిమానులమే అంటూ చాలాసార్లు హింట్ ఇస్తున్నారు. నిజానికి తొలిప్రేమ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అతనికి అభిమానులుగా మారిపోతారు. ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమాతో సైతం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వైవిద్య భరితమైన సినిమాలైతే చేశాడు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు…
ప్రస్తుతం ఉస్తాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా డివైడ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికి అభిమానులను మాత్రం పూర్తి స్థాయిలో ఇంప్రెస్ చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ గాని, పవన్ కళ్యాణ్ మార్కు డైలాగులు గాని సినిమాకి హైలెట్ గా నిలిచాయనే చెప్పాలి…