Abbas: టాక్సీ డ్రైవర్ గా మారిన ఒకప్పటి లవర్ బాయ్… ఆత్మహత్య వరకూ వెళ్లిన అబ్బాస్ జీవితం

అబ్బాస్ అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. దాంతో అబ్బాస్ టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో బిజీ అయ్యారు. ఎలాంటి నేపథ్యం లేని అబ్బాస్ స్క్రిప్ట్ సెలక్షన్స్ లో తడబడ్డారు. ఎంత త్వరగా ఫేమ్ తెచ్చుకున్నాడో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయ్యాడు. సెకండ్ హీరో, సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయాడు. చక్కని రూపం, అందమైన హెయిర్ స్టైల్ కలిగి చాక్లెట్ బాయ్ లా ఉండే అబ్బాస్ సక్సెస్ కాలేకపోయారు.

Written By: Shiva, Updated On : జూలై 19, 2023 11:01 ఉద.

Abbas

Follow us on

Abbas: 1996లో విడుదలైన తమిళ చిత్రం కాదల్ దేశం. తెలుగులో ప్రేమ దేశంగా విడుదలైంది. ఈ మూవీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రేకథల్లో ట్రెండ్ సెట్టర్. దర్శకుడు కథిర్ ఒక క్లీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెరకెక్కించారు. స్నేహం, ప్రేమ ప్రధానాంశాలుగా ఎమోషనల్ ఎంటర్టైనర్ రూపొందించారు. ఈ మూవీతో అబ్బాస్ హీరోగా పరిచయమయ్యాడు. వినీత్ మరొక హీరో. టబు హీరోయిన్. ఏ ఆర్ రెహమాన్ సాంగ్స్ అద్భుతం చేశాయి. మొత్తంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రేమదేశం బ్లాక్ బస్టర్ కొట్టింది.

అబ్బాస్ అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. దాంతో అబ్బాస్ టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో బిజీ అయ్యారు. ఎలాంటి నేపథ్యం లేని అబ్బాస్ స్క్రిప్ట్ సెలక్షన్స్ లో తడబడ్డారు. ఎంత త్వరగా ఫేమ్ తెచ్చుకున్నాడో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయ్యాడు. సెకండ్ హీరో, సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయాడు. చక్కని రూపం, అందమైన హెయిర్ స్టైల్ కలిగి చాక్లెట్ బాయ్ లా ఉండే అబ్బాస్ సక్సెస్ కాలేకపోయారు.

2015 తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. తాజాగా ఇండియాలో అడుగుపెట్టిన అబ్బాస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టెన్త్ గ్రేడ్ ఫెయిల్ కావడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అదే సమయంలో ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది. దాంతో చనిపోవాలని ఫిక్స్ అయ్యాను. వేగంగా వస్తున్న ఓ భారీ వాహనంకి ఎదురెళ్లాలని రోడ్డు ప్రక్కన నిల్చున్నాను. భారీ వాహనం వెనుక బైక్ వస్తుంది.

నేను ఆ లారీ క్రింద పడితే వెనుక వస్తున్న బైక్ లారీని గుద్దుతుంది. నా వల్ల అతని జీవితం పాడవుతుందని ఆ ఆలోచన మానుకున్నాను. సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను. ప్రేమ దేశం సినిమాకు ఒక సాధారణ ప్రేక్షకుడిగా వెళ్ళాను. నెక్స్ట్ డే మా ఇంటి ముందు వేల మంది జనం. వాళ్ళు నాపై చూపించిన ప్రేమను చూసి ఆశ్చర్యపోయాను. కెరీర్లో సక్సెస్ చూశాను ఫెయిల్యూర్ చూశాను. నటన మీద బోర్ కొట్టేసింది. న్యూజిలాండ్ వెళ్లి బైక్ మెకానిక్ గా, ట్యాక్సీ డ్రైవర్ గా మారాను, అని చెప్పుకొచ్చారు.