https://oktelugu.com/

OTT releases: ఈ వారం ‘ఓటీటీ’ సిరీస్ లు సినిమాలు

OTT releases: ఈ కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలరించింది, నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టింది ఓటీటీ (OTT) సంస్థలే. కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఓటీటీలకే దక్కుతుంది. పైగా ఓటీటీ సంస్థలు మాత్రమే నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో వస్తూ ఉన్నాయి. ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ ఉన్నాయి. అయితే, ఈ కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన కార‌ణంగా థియేట‌ర్ల ద‌గ్గ‌ర సంద‌డి […]

Written By:
  • admin
  • , Updated On : August 30, 2021 / 12:45 PM IST
    Follow us on

    OTT releases: ఈ కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలరించింది, నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టింది ఓటీటీ (OTT) సంస్థలే. కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఓటీటీలకే దక్కుతుంది. పైగా ఓటీటీ సంస్థలు మాత్రమే నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో వస్తూ ఉన్నాయి. ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ ఉన్నాయి.

    అయితే, ఈ కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన కార‌ణంగా థియేట‌ర్ల ద‌గ్గ‌ర సంద‌డి చేయడానికి కొన్ని సినిమాలు ముస్తాబు అయినా, ఇంకా ఓటీటీలోనే రిలీజ్ కావడానికి మరి కొన్ని సినిమాలు సిరీస్ లు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తోంది.

    మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

    డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో ప్రసారాలు

    బ్లాక్‌ విడో – సెప్టెంబరు 3 విడుదల అవుతుంది.

    అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం

    సిండ్రెల్లా – సెప్టెంబరు 3 విడుదల అవుతుంది.

    నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారాలు

    స్పార్కింగ్‌ జాయ్‌ – ఆగస్టు 31 విడుదల అవుతుంది.

    గుడ్‌ గర్ల్స్‌ – ఆగస్టు 31 విడుదల అవుతుంది.

    మనీ హెయిస్ట్‌-సీజన్‌ 5 – సెప్టెంబరు 3 విడుదల అవుతుంది.

    జీ5 లో ప్రసారాలు

    హెల్మెట్‌ – సెప్టెంబరు 3 విడుదల అవుతుంది

    హెచ్‌బీవో మ్యాక్స్‌ లో ప్రసారాలు

    రెమినిసెన్స్‌ – సెప్టెంబరు 3 విడుదల అవుతుంది

    ఏది ఏమైనా మొత్తానికి ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ రాకతో సినిమాలను చూసే విధానమే మారిపోయింది. చక్కగా రిలీజ్ రోజే హాయిగా ఇంట్లో కూర్చుని.. నచ్చిన సమయంలో నచ్చినట్టు సినిమా చూసే అవకాశం రావడం గొప్ప అనుభూతినే. పైగా బాగా నచ్చిన సీన్ ను మళ్ళీ మళ్ళీ చూసి ఆస్వాదించవచ్చు.

    స్టార్ హీరో సినిమాని మొదటి షోలోనే ఈ స్థాయిలో ఎంజాయ్ చేసే వెసులుబాటు ప్రేక్షకుడికి ఇంత త్వరగా కలుగుతుంది అంటే.. అందుకు పెరిగిన టెక్నాలజీనే కారణం. మొత్తమ్మీద ఓటీటీల కారణంగా సినిమా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.