Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu OTT: విన్నర్ విషయంలో సీక్రెట్ మెయింటేన్ చేస్తున్న బిగ్ బాస్.. అతను...

Bigg Boss Telugu OTT: విన్నర్ విషయంలో సీక్రెట్ మెయింటేన్ చేస్తున్న బిగ్ బాస్.. అతను గెలిచే ఛాన్స్..

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ అంటేనే సరికొత్త టాస్క్ లకు, సరికొత్త టెన్షన్ లకు పెట్టింది పేరు. నిత్యం గొడవలతో నానా రచ్చ చేసే కంటెస్టెంట్ లతో ఎవరూ ఊహించని గేమ్ లు ఆడిస్తుంటాడు బిగ్ బాస్. గతంలో కంటే ఈసారి సరికొత్తగా బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఎంటర్ టైన్ మెంట్ చేస్తున్నాడు. కాగా గతంలో లాగే ఈ సారి కూడా విన్నర్ విషయంలో కొత్త ట్విస్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు.

Bigg Boss Telugu OTT
Bigg Boss Telugu OTT

అందరూ ఊహించినట్టుగానే ముందుగా విన్నర్ ఎవరో తెలిస్తే కిక్ ఏం ఉంటుంది.. అలా జరిగితే బిగ్ బాస్ ఇంత పెద్ద సక్సెస్ ఎందుకు అవుతుంది.. అందుకే ఈసారి విన్నర్ విషయంలో చాలా సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నాడు బిగ్ బాస్. గతంలో చూసుకుంటే రాహుల్ సిప్లిగంజ్, వీజె సన్నీ విన్నర్స్ అవుతారని ఎవరూ ఊహించలేదు. ఆ రెండు సీజన్లు చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి అనే చెప్పుకోవాలి.

అందుకే ఈసారి కూడా విన్నర్ ఎవరో ముందుగా చెప్పకుండా చివరకు ట్విస్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సారి చాలా మంది మొదటి నుంచే బిందుమాధవి విన్నర్ అని, అఖిల్ రన్నరప్ అని తేల్చేస్తున్నారు. అందుకే ఈ సారి అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న వీరిని కాకుండా.. యాంకర్ శివను హైలెట్ చేస్తున్నాడు బిగ్ బాస్. చూస్తుంటే యాంకర్ శివ విన్నర్ అయి.. బిందు మాధవి రన్నరప్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Bigg Boss Telugu OTT
Bigg Boss Telugu OTT

అటు అఖిల్ కూడా టైటిల్ ఫేవరెట్ గానే బరిలో ఉన్నాడు. ఒకవేళ అతను గెలిస్తే మాత్రం బిందు మాధవి ఫాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ.. చివరి వరకు ప్రేక్షకులు ఊహించని వ్యక్తిని ట్రాక్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ చూస్తున్నాడు. ఇందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ గా లేని వ్యక్తిని హైలెట్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించాలంటే ఆమేరకు బిగ్ బాస్ ప్రణాళికలు రూపొందించుకోవాలి. మరి ఈసారి సరికొత్త ట్విస్ట్ ఇవ్వడానికి బిగ్ బాస్ ఎలాంటి ప్లాన్ చేస్తాడో చూడాలి.

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version