Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు, బుల్లితెర సెలబ్రెటీలు పాల్గొన్నారు. నటి హేమ పేరు ప్రధానంగా వినిపించింది. రేవ్ పార్టీకి ఆమె హాజరయ్యారని విశ్వసనీయ సమాచారం. కాగా హేమ తాను పార్టీకి వెళ్లలేదని నమ్మించే ప్రయత్నం చేసింది. మీడియాలో న్యూస్ లీకైన వెంటనే ఖండిస్తూ వీడియో బైట్ విడుదల చేసింది. హేమ రేవ్ పార్టీకి వెళ్లారని బెంగుళూరు పోలీసులు ధృవీకరించారు. ఆమె బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.
హేమ విచారణకు రావాలంటూ శనివారం నోటీసులు పంపించారు. ఈ నెల 27 అంటే నేడు హేమ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆమెతో పాటు మరో ఎనిమిది మందికి నోటీసులు అందాయి. అయితే హేమ విచారణకు హాజరు కావడం అనుమానమే అని తెలుస్తుంది. ఎందుకంటే హేమని అరెస్ట్ చేయొద్దని తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు బెంగళూరు పోలీసులను ఒత్తిడి చేస్తున్నారట.
హేమ తనకు పరిచయం ఉన్న బడా రాజకీయ నాయకులతో బెంగళూరు పోలీసులకు పదే పదే ఫోన్ కాల్స్ చేయిస్తుందని అంటున్నారు. ఆమె అరెస్ట్ కాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రేవ్ పార్టీకి సిద్ధిక్, నాగబాబు అనే వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభ్యం అయినట్లు సమాచారం.
ఈ పార్టీలో పాల్గొన్న 100 మందిలో 80 మందికి పైగా డ్రగ్స్ తీసుకున్నారని తేలింది. రేవ్ పార్టీలో కొకైన్, గంజాయి, హైడ్రో గంజా,ఎక్స్ టి సి లాంటి డ్రగ్స్ వాడినట్లు పోలీసులు చెబుతున్నారు. వాసు అనే వ్యక్తి 50 లక్షల ఖర్చుతో రేవ్ పార్టీ నిర్వహించారట. వాసు బర్త్ డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసుల సమాచారం. పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.