దానికోసం ‘కుమారి’ అందాల అరబోత

యంగ్ హీరోయిన్ హెబ్బాపటేల్ టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కుమారి-21ఎఫ్ మూవీతో హెబ్బాపటేల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కుమారి పాత్రలో హెబ్బాపటేల్ బోల్డ్ గా నటించి మెప్పింది. గ్లామర్ షో, ముద్దు సీన్లలో హెబ్బాపటేల్ రెచ్చిపోతుండటంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు తలుపుతట్టాయి. దీంతో పారితోషికం కూడా పెంచేసింది. అయితే కుమారి-21ఎఫ్ తర్వాత సినిమాలేవీ ఈ అమ్మడికి సరైన విజయాన్ని అందించలేకపోయాయి. అయినప్పటికీ పారితోషికం తగ్గించుకోకపోవడంతో ఇటీవల కాలంలో ఈ భామకు సినిమా అవకాశాలు […]

Written By: Neelambaram, Updated On : May 5, 2020 1:08 pm
Follow us on


యంగ్ హీరోయిన్ హెబ్బాపటేల్ టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కుమారి-21ఎఫ్ మూవీతో హెబ్బాపటేల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కుమారి పాత్రలో హెబ్బాపటేల్ బోల్డ్ గా నటించి మెప్పింది. గ్లామర్ షో, ముద్దు సీన్లలో హెబ్బాపటేల్ రెచ్చిపోతుండటంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు తలుపుతట్టాయి. దీంతో పారితోషికం కూడా పెంచేసింది. అయితే కుమారి-21ఎఫ్ తర్వాత సినిమాలేవీ ఈ అమ్మడికి సరైన విజయాన్ని అందించలేకపోయాయి. అయినప్పటికీ పారితోషికం తగ్గించుకోకపోవడంతో ఇటీవల కాలంలో ఈ భామకు సినిమా అవకాశాలు తగ్గాయి.

మద్యం ప్రియులపై మరో పిడుగు..!

హీరోయిన్ అవకాశాలు తగ్గినప్పటికీ గెస్ట్ రోల్, ఐటమ్ సాంగ్స్ లో హెబ్బాపటేల్ మెరుస్తోంది. వెండితెరపై అందాల అరబోతకు ఈ భామ ఎల్లప్పుడు రెడీగానే ఉంటోంది. దీంతో ఐటమ్ సాంగ్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ మూవీలో గెస్ట్ రోల్ చేసింది. ఈ మూవీ విజయవంతమైన ఈ అమ్మడికి పేరుమాత్రం రాలేదు. అదేవిధంగా రామ్ హీరోగా నటిస్తున్న ‘రెడ్’ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. రామ్ తో కలిసి ప్రేక్షకులకు అందాల విందు చేయనుందని తెలుస్తోంది. లాక్డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా రీలీజ్ కోసం ఈ అమ్మడు ఎదురుచూస్తోంది. ప్రస్తుతం వెబ్ సీరీస్ హవా నడుస్తుండటంతో వాటిపై హెబ్బాపటేల్ ఫోకస్ పెట్టింది.

రాజధాని చుట్టూ కరోనా వలయం!

రోమాన్స్ సీన్లతోపాటు బోల్డ్ గా నటించేందుకు హెబ్బాపటేల్ మొహమెటం చెప్పకపోవడంతో వెబ్ సీరిస్ అవకాశాలు ఆమెకు బాగానే వస్తున్నాయి. ఇటీవల ‘ఆహా’ యాప్ లో ‘మస్తీస్’ అనే వెబ్ సీరీస్ ఈ అమ్మడు నటించి మెప్పింది. దీంతో అదే యాప్ నుంచి మరో రెండు వెబ్ సీరిస్ అవకాశాలు వచ్చాయి. ఈ రెండు వెబ్ సీరిస్ లు అడల్డ్ రెటేడ్ తరహాలో ఉంటాయని తెలుస్తోంది. ఈమేరకు హెబ్బా పటేల్ అందాల అరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో ఈ వెబ్ సీరీస్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సీరిస్ లు హెబ్బాపటేల్ కు తిరిగి మునుపటిలా సినిమా ఆఫర్లు దక్కేలా చేస్తాయో లేదా వేచి చూడాల్సిందే..!