OG Overseas Fans: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న సినిమాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మొదలు అవుతున్నాయి. అప్పుడే ఈ చిత్రం 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టింది. ఓవర్సీస్ లో అయితే ఆల్ టైం రికార్డు దిశగా అడుగులు వేస్తుంది. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఫైనల్ కంటెంట్ రెడీ అవ్వలేదు. ఓవర్సీస్ కి ఈపాటికి కంటెంట్ వెళ్ళిపోవాలి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఇంకా రెండు రీల్స్ కి సంబంధించిన DI వర్క్ జరుగుతుందట. ఈరోజు రాత్రి, లేదా రేపు ఉదయం లోపు కంటెంట్ వెళ్లే అవకాశం ఉందని, అంతే కాకుండా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ఇది కాసేపు పక్కన పెడితే కెనడా దేశం లో ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ ఆల్ టైం రికార్డు గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. కానీ అక్కడి లోకల్ డిస్ట్రిబ్యూటర్ తో గొడవలు ఏర్పడడం తో కెనడా లోని ప్రధాన థియేటర్స్ చైన్ అయినటువంటి ‘యోర్క్’ సినిమాస్ ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ని హోల్డ్ లో పెట్టింది. దీంతో టికెట్స్ బుక్ చేసుకున్న అభిమానులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా USA కి ఇంకా కంటెంట్ డెలివరీ అవ్వకపోవడం AMC లాంటి ప్రముఖ టాప్ థియేటర్స్ చైన్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టలేదు. ఈ చైన్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే అక్షరాలా మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కేవలం ప్రీ సేల్స్ నుండి వస్తాయి. కానీ అది ఇంకా జరగలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రం నార్త్ అమెరికా లో 2 మిలియన్ డాలర్స్ కి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మంగళవారం లోపు కంటెంట్ ఓవర్సీస్ కి వెళ్ళిపోతే బాగుంటుందని, లేకపోతే ఈ సినిమాకు ఆల్ టైం రికార్డు ని నెలకొల్పే అరుదైన అవకాశం పోతుందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లోని LB స్టేడియం లో ‘ఓజీ మ్యూజిక్ కన్సర్ట్’ పేరుతో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి సంబందించిన పాసుల కోసం అభిమానులు బారులు తీశారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాదు ఇదే ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. చూడాలి మరి ఈ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై ఇంకా ఎంతటి బజ్ ఏర్పడుతుంది అనేది.