https://oktelugu.com/

Surekhavani: నన్ను వాడుకొని వదిలేశాడు.. నటి సురేఖవాణి కామెంట్స్.. టాలీవుడ్ లో దుమారం

తాజాగా ఈమె షేర్ చేసిన వీడియోలో నాకు ఎవరు లేరు ఉండాలని కూడా నేను అనుకోవడం లేదు. లేని ప్రేమలు ఉన్నాయని ఫీల్ కూడా కాను. అలా బతకలేను అంటూ తెలిపింది సురేఖ.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 12, 2023 11:34 am
    Surekhavani

    Surekhavani

    Follow us on

    Surekhavani: క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతో మంది ఉంటారు. కానీ కొందరు మాత్రమే అందరి మనుసులో స్థానాన్ని సంపాదించుకుంటారు. ఇంట్లో భర్త, బాబాయ్, మామ క్యారెక్టర్లు ఎంత ముఖ్యమో.. భార్య, పిన్ని, అత్త క్యారెక్టర్లు కూడా అంతే ముఖ్యం. ఇలాంటి క్యారెక్టర్లలో జీవించే నటి అంటే తెలుగు చిత్రసీమలో ముందుగా గుర్తు వచ్చే పేరు సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది. ఇందులోనూ ముఖ్యంగా వైయస్ షర్మిల వీడియోలు ఎక్కువగా చేస్తూ వైరల్ అవుతుంది.

    తాజాగా ఈమె షేర్ చేసిన వీడియోలో నాకు ఎవరు లేరు ఉండాలని కూడా నేను అనుకోవడం లేదు. లేని ప్రేమలు ఉన్నాయని ఫీల్ కూడా కాను. అలా బతకలేను అంటూ తెలిపింది సురేఖ. అవసరానికి వాడుకొని సమయం వచ్చినప్పుడు ఒదిలేసే స్టుప్పిడ్ ను నేను కాదు అని ఆ వీడియోలో తెలిపింది. అయితే ఈమెను ఎవరో వాడుకొని వదిలసారు కాబట్టే ఇలాంటి డైలాగ్స్ చెబుతుంది. కానీ అలాంటి వారికి ఇప్పుడైనా దూరంగా ఉండండి మేడం సమాజంలో ఇలాంటి వారే ఎక్కువగా ఉన్నారు అంటూ సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు.

    ఇక ఈమె భర్త సురేష్ తేజ 2019వ సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే. భర్త చనిపోయిన దగ్గర నుంచి సురేఖ వాణి కూతురుతో మాత్రమే కలిసి ఉంటుంది. కానీ మరో పెళ్లి చేసుకోలేదు. కానీ ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు మాత్రం గుప్పమన్నాయి. వాటికి ఎప్పుడు రియాక్ట్ అవలేదు ఈ నటి. అంతే కాదు ఈమె కూతురు సుప్రీతకు కూడా పెళ్లి చేయాలి అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కూతురుకు పెళ్లి చేసి తర్వాత ఈమె చేసుకుంటుందనే ప్రచారం కూడా సాగింది.