Samantha
Samantha : హీరోయిన్ సమంత కి ఇండస్ట్రీ లో స్నేహితులు చాలా ఎక్కువే. కానీ వాళ్లంతా కష్ట సమయంలో తోడుంటారో లేదో తెలియదు కానీ, కొంతమంది మాత్రం సమంత కోసం ఏమైనా చేసే విధంగా ఉన్నారు. ముఖ్యంగా నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మానసికంగా, శారీరకంగా ఎంత కృంగిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ ఆలోచనల నుండి తప్పించుకోలేక ఆమె మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధికి కూడా గురైంది. ఈ వ్యాధి నుండి కోలుకునేందుకు ఆమెకు చాలా సమయమే పట్టింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ సిరీస్ తర్వాత ఆమెకు వచ్చిన పాన్ ఇండియన్ క్రేజ్ ని సరిగా ఉపయోగించుకోలేక, కేవలం బెడ్ కి మాత్రమే ఏడాది పాటు పరిమితమైంది. ఆ సమయంలో ఆమెకి అండగా నిలబడిన వాళ్ళ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యింది.
సమంతాకి మొదటి సినిమా నుండి చిన్మయి డబ్బింగ్ చెప్తూ వచ్చింది. ఈమె భర్త రాహుల్ రవి చంద్రన్. అందాల రాక్షసి అనే చిత్రం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇందులో హీరో ఆయనే. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా సమంత కి ప్రాణ స్నేహితులు. రాహుల్ గురించి సమంత మాట్లాడుతూ ‘నాకు మయోసిటిస్ వ్యాధి సోకినప్పుడు రాహుల్ ప్రతీ రోజు నన్ను చూసేందుకు వచ్చేవాడు. నాతో కాసేపు సమయాన్ని గడిపి జోక్స్ వేస్తూ నా మనసులోని భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేసేవాడు. రాహుల్ కారణంగా నాకు చాలా వరకు ఉపశమనం దొరికింది. నాకు అవసరమైన పనులు కూడా అతనే చేసి పెట్టేవాడు. రాహుల్ లాంటి స్నేహితులు దొరకాలంటే నిజంగా అదృష్టం చేసుకోవాలి’ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది సమంత. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
రాహుల్ రవిచంద్రన్ కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా. ప్రస్తుతం ఆయన హీరోయిన్ రష్మిక తో ‘గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తున్నాడు. గతంలో ఆయన ‘చి..ల.సౌ’ , ‘మన్మథుడు 2’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక సమంత విషయానికి రీసెంట్ గానే ఈమె ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ని రాజ్ & డీకే తెరకెక్కించారు. ప్రస్తుతం వీళ్ళు తీస్తున్న పీరియడ్ వెబ్ సిరీస్ లో కూడా సమంత నటిస్తుంది. వీటితో పాటు ఆమె రీసెంట్ గానే ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించింది. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆమె కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ సినిమాలను నిర్మించనుంది.