https://oktelugu.com/

Prabhas : ఒకప్పుడు కలెక్షన్స్ లో ప్రభాస్ ని మించిన హీరో..కానీ ఇప్పుడు కానిస్టేబుల్ అయిపోయాడు..అతను ఎవరో మీరే గుర్తుపట్టండి!

సినీ ఇండస్ట్రీ లో హీరో గా ఎంట్రీ నటించడమే ఒక అదృష్టం. ఎన్నో లక్షల మంది టాలెంట్ ఉన్న వాళ్ళు సినిమాల మీద అమితాసక్తితో ఇండస్ట్రీ లోకి వచ్చి అదృష్టం కలిసి రాక ఇప్పటికీ కృష్ణ నగర్ లో బ్రతుకుతున్నారు.

Written By: , Updated On : January 28, 2025 / 05:35 PM IST
Prabhas

Prabhas

Follow us on

Prabhas : సినీ ఇండస్ట్రీ లో హీరో గా ఎంట్రీ నటించడమే ఒక అదృష్టం. ఎన్నో లక్షల మంది టాలెంట్ ఉన్న వాళ్ళు సినిమాల మీద అమితాసక్తితో ఇండస్ట్రీ లోకి వచ్చి అదృష్టం కలిసి రాక ఇప్పటికీ కృష్ణ నగర్ లో బ్రతుకుతున్నారు. అలాంటి ఇండస్ట్రీ లో మొదటి సినిమాతోనే హీరోగా మారి, చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టై మంచి క్రేజ్ ని సొంతం చేసుకోవడమంటే ఎంత అదృష్టం రాసి పెట్టి ఉండాలి?, అలాంటి కుర్ర హీరోలు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. కొంతమంది వచ్చిన ఆ క్రేజ్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, తమ స్థాయి మరింత పెరిగేలా స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటూ ముందుకు పోతుంటే, మరికొంతమంది మాత్రం వచ్చిన ఆ అద్భుతమైన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక, కేవలం రెండు మూడు సూపర్ హిట్ చిత్రాలకు మాత్రమే పరిమితమై కెరీర్ ని ముగించేస్తున్నారు. అలాంటి హీరోల జాబితా తీస్తే మనకి ముందుగా గుర్తుకొచ్చే పేరు వరుణ్ సందేశ్.

ఈయన ‘హ్యాపీ డేస్’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో యూత్ ఆడియన్స్ ఈ చిత్రానికి వెర్రెక్కిపోయారు. ఈ సినిమాని చూసి బీటెక్ లో చేరిన విద్యార్థులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఆ రోజుల్లో ఈ చిత్రం దాదాపుగా 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అప్పట్లో ప్రభాస్ కి కూడా ఇంత కలెక్షన్స్ రాలేదు. ఈ చిత్రం తర్వాత ఆయన ‘కొత్తబంగారు లోకం’ అనే సినిమా చేసి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి. రైజింగ్ స్టార్ అవుతాడని అనుకుంటే కనుమరుగు అయిపోయాడు వరుణ్ సందేశ్. ఇప్పుడు కేవలం ఆయన సైడ్ క్యారెక్టర్స్ కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ హీరోగా నటిస్తూ చేసిన చిత్రం ‘కానిస్టేబుల్’. సుభాన్ ఎస్ కె అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాని జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీశ్ నిర్మించాడు. ఇందులో వరుణ్ సందేశ్ సరసన మధులిక వారణాసి అనే కొత్త హీరోయిన్ నటించింది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాటని హైదరాబాద్ కమీషనర్ సివి ఆనంద్ చేత లాంచ్ చేయించారు. కెరీర్ లో మొట్టమొదటిసారి ఒక సరికొత్త ప్రయత్నం చేస్తూ ఈ చిత్రాన్ని చేశానని, ఆడియన్స్ కచ్చితంగా ఈ సినిమాని ఆదరిస్తారని అనుకుంటున్నాను అంటూ వరుణ్ సందేశ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఆయన లుక్ కూడా సినిమాలో చాలా కొత్తగా, పవర్ ఫుల్ గా ఉంది. మరి ఈ చిత్రంతో ఆయన సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.