https://oktelugu.com/

Vijay Sethupathi: ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకున్న విలన్ అతనే.. ఇది సరికొత్త రికార్డు.. వామ్మో అన్ని కోట్లా ?

Vijay Sethupathi: బాలీవుడ్ స్టార్ హీరో ‘షారుఖ్ ఖాన్’ హీరోగా తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నేషనల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే హీరో షారుఖ్ ఖాన్ కి విలన్ గా ఈ సినిమాలో విలక్షణ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా నటించడానికి […]

Written By:
  • Shiva
  • , Updated On : August 29, 2022 / 03:06 PM IST
    Follow us on

    Vijay Sethupathi: బాలీవుడ్ స్టార్ హీరో ‘షారుఖ్ ఖాన్’ హీరోగా తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నేషనల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే హీరో షారుఖ్ ఖాన్ కి విలన్ గా ఈ సినిమాలో విలక్షణ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా నటించడానికి విజయ్‌ సేతుపతి ఏకంగా రూ. 21 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడు.

    Vijay Sethupathi

    ఇప్పుడు కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. కారణం.. ఇప్పటి వరకు విజయ్ సేతుపతి రూ.15 కోట్ల వరకు తీసుకునేవాడు. కానీ, షారుఖ్ సినిమా కోసం మాత్రం విజయ్‌ సేతుపతి తన రెమ్యూనరేషన్‌ ను భారీగా పెంచేశాడు. ఇదిలా ఉంటే జవాన్‌ లో నయనతా హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఈ చిత్రం నేషనల్ రేంజ్ సినిమా అయినా.. అట్లీ మాత్రం తన తమిళ ప్రేమను చంపుకోలేకపోతున్నాడు.

    ఇప్పుడు కూడా సౌత్ హీరో విజయ్ సేతుపతి భారీ మొత్తంలో ఇప్పించాడు. అలాగే, నయనతారకి కూడా అట్లీ భారీ పారితోషికం ఇప్పించాడు. ఈ సినిమాలో ఎక్కువగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులనే మెయిన్ పాత్రలు కోసం తీసుకోవడంతో పాటు సన్నివేశాలను కూడా ఎక్కువగా సౌత్ సినిమాల మాదిరిగానే రాసుకున్నాడు. మొత్తానికి తన సినిమాలో హీరో బాలీవుడ్ సూపర్ స్టార్.. అయినా అట్లీ మాత్రం తమిళ వాసనను వదలడం లేదు.

    పైగా సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. మొదట నిర్మాతలు, ఈ సినిమాలో హీరోయిన్ గా విద్యాబాలన్ తీసుకోవాలనుకున్నారు. కానీ, అట్లీ మాత్రం షారుఖ్ ను ఒప్పించి నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేశాడు. హీరోయిన్ విషయంలో కూడా అట్లీదే పై చేయి అయింది కాబట్టి.. మిగిలిన విషయాల్లో అయినా తమ మాట నెగ్గుతుంది అని నిర్మాతలు ఆశ పడుతున్నారే గాని, నిర్మాతలకు మాత్రం నిరాశే ఎదురవుతోంది.

    Atlee, Shah Rukh

    అట్లీ మిగిలిన కీలక పాత్రల్లోనూ సౌత్ ఇండియా నటీనటులనే సెలెక్ట్ చేశాడు. మొత్తానికి పేరుకి షారుఖ్ ఖాన్ సినిమా అయినా సౌత్ డామినేషనే ఈ సినిమాలో ఎక్కువ గా కనిపింబోతుంది. ఏది ఏమైనా అట్లీ తీసిన నాలుగు సినిమాలు ‘రాజారాణి, పోలీస్, అదిరింది, విజిల్’ ఇలా ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి. అందుకే అట్లీకి షారుఖ్ కూడా ఎదురు చెప్పలేక పోతున్నాడు. పైగా ఈ సినిమా పై షారుఖ్ అభిమానులతో పాటు షారుఖ్ ఖాన్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి షారుక్ ఖాన్ కి అట్లీ ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

    Tags