https://oktelugu.com/

Pushpa: థియేటర్​లో ఫ్యామిలీతో పుష్పరాజ్​ సందడి.. ఎగబడిన అభిమానులు

Pushpa: థియేటర్లలో పుష్ప సందడి మాములుగా లేదు.. సుకుమార్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టైలిష్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాలితో కలిసి థియేటర్​లో సినిమా చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే బన్నీ ఫ్యాన్స్​ తెగ సందడి చేేసేశారు. బన్నీ కార్​ చుట్టూ చేరి.. ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. Also Read: వాళ్ళల్లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 01:42 PM IST
    Follow us on

    Pushpa: థియేటర్లలో పుష్ప సందడి మాములుగా లేదు.. సుకుమార్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టైలిష్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాలితో కలిసి థియేటర్​లో సినిమా చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే బన్నీ ఫ్యాన్స్​ తెగ సందడి చేేసేశారు. బన్నీ కార్​ చుట్టూ చేరి.. ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు.

    Pushpa

    Also Read: వాళ్ళల్లో మరో వాణిశ్రీ, బ్రహ్మానందం.. గొప్ప నటులయ్యేది చిన్న పాత్రలతోనే !

    చుట్టూ ఉన్న బన్నీ బాక్సర్స్, పోలీసులను కూడా లెక్కచేయకుండా బన్నీని చూడటం కోసం ఆరాటపడ్డారు. బన్నీ కూడా ఎక్కడా సీరియస్​ కాకుండా అందరితో నవ్వుతూ పలకరించారు. ఫ్యాన్స్​ను దాటుకుని ఎలాగోలా థియేటర్​లోకి వెళ్లారు. వాళ్లను దాటి వెళ్లేందుకు కాస్త కష్టమనిపించినప్పటికీ.. వారి ప్రేమను ఓర్చుకుంటూ.. ముందుకు కదిలారు. అలా ఫ్యాన్స్​తోనే పాటే కలిసి సినిమా చూశారు బన్నీ.

    కాకా, మరోవైపు ఆర్టీసీ క్రాస్​ రోడ్​ అంటే థియేటర్లకు అడ్డా.. అక్కడ ఏ సినిమా రిలీజ్​ అయినా ఆ సినిమా హీరో వచ్చి ఫ్యాన్స్​ రెస్పాన్స్ చూడటం ఆనవాయితీ. ఈక్రమంలోననే తొలిరోజు తన సినిమా రెస్పాన్స్ చూసేందుకు హీరోలు ఈ థియేటర్లనే ఎంచుకుంటారు. తాజాగా, అల్లు అర్జున్​ కూడా పుష్ప సినిమా చూసేందుకు సంధ్య థియేటర్​కు వస్తారనుకున్నఫ్యాన్స్​..  ఆయన రాక కోసంఫ్యాన్స్ వెయిట్​ చేస్తుండగా.. అలా పుష్ప గెటప్​లో వచ్చి ఒకరిన చూసి అందరూ అతనే బన్నీ అనుకున్నారు. సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

    Also Read: విలన్ గా ఇంత గొప్పగా నటించగలడా ? దర్శకులూ చూడండి !