Vijaya Bapineedu: అరుదైన సినీ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు !

Vijaya Bapineedu: సినిమా రంగంలో ఎన్నో లొసుగులు ఉంటాయి. వాటిని తట్టుకుని ఎక్కువ సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో ఉండటం అంటే.. అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటి అరుదైన సినీ ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు విజయ బాపినీడు గారు. ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. తెలుగు సినిమా దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు.ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు కూడా.ఆయన అనేక యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో […]

Written By: Raghava Rao Gara, Updated On : March 27, 2022 10:22 am
Follow us on

Vijaya Bapineedu: సినిమా రంగంలో ఎన్నో లొసుగులు ఉంటాయి. వాటిని తట్టుకుని ఎక్కువ సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో ఉండటం అంటే.. అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటి అరుదైన సినీ ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు విజయ బాపినీడు గారు. ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. తెలుగు సినిమా దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు.ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు కూడా.ఆయన అనేక యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Vijaya Bapineedu

వాటిలో మగమహారాజు, ఖైదీ నెం. 786, మగధీరుడు ముఖ్యమైనవి.ఆయన 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో జన్మించాడు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసాడు. కొద్ది రోజులు వైద్య ఆరోగ్య శాఖలో పని చేశాడు. బాపినీడు తొలుత “అపరాధ పరిశోధన” అనబడు ఒక మాసపత్రికలో కథలు వ్రాసేవారు. ఇవి పాఠకులను విశేషముగా ఆకర్షించాయి.

Also Read:   టాలీవుడ్ లేటెస్ట్ మూవీ డేట్స్ !

చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసాడు.
ఇక ఆయన సినిమారంగ ప్రస్థానానికి వస్తే..
1982లో దర్శకుడిగా తెలుగుసినీరంగానికి పరిచయమై తన సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు.. ఎక్కువగా చిరంజీవి (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), శోభన్ బాబు నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశాడు.

Vijaya Bapineedu

అలాగే నటుడు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన కొడుకులు బాపినీడు చివరి చిత్రం.
అంతేకాకుండా, రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా, భువనచంద్రను పాటల రచయితగా, కాశీ విశ్వనాథ్‌ను మాటల రచయితగా తెలుగు సినీంగానికి పరిచయం చేసింది ఈయనే.

Also Read:  తండ్రీ కొడుకుల పోటీ పడ్డా.. హిట్ కొట్టలేకపోయారు !

Tags