https://oktelugu.com/

Aadavallu Meeku Johaarlu: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సెన్సార్ రిపోర్ట్ వ‌చ్చేసింది.. మూవీ అలా ఉంటుంద‌ట‌

Aadavallu Meeku Johaarlu: తెలుగు సినిమాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన హీరో శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శుక్రవారం ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమైంది. మంచి నటనతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలను ఎంతో అద్భుతంగా చేస్తాడనే పేరున్న శర్వానంద్ మరోసారి.. తన మాయతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 3, 2022 / 04:43 PM IST
    Follow us on

    Aadavallu Meeku Johaarlu: తెలుగు సినిమాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన హీరో శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శుక్రవారం ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమైంది. మంచి నటనతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలను ఎంతో అద్భుతంగా చేస్తాడనే పేరున్న శర్వానంద్ మరోసారి.. తన మాయతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయాడు.

    Aadavallu Meeku Johaarlu

    కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఎంతో భారీగా నిర్మించారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత వస్తున్న మొదటి పూర్తిస్థాయి కుటుంబ కథాచిత్రం కావడంతో.. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే విడుదలకు సిద్ధమైపోయిన ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ ఆ ఆసక్తిని మరింత పెంచేలా ఉంది.

    Also Read:  రెండ్రోజుల్లో ప్రివ్యూ.. నాలుగు రోజుల్లో రిలీజ్ డేట్ ఫిక్స్

    ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాకు సెన్సార్ టీం పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరోగా శర్వానంద్, హీరోయిన్ గా రష్మిక మందనలు ఎంతో బాగా నటించారని.. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, సీన్లు ఎంతో బాగా వచ్చాయని టాక్. నాటి తారలు ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశిలు ఈ సినిమాకు మరో ప్లస్ అట. ఇక అన్నింటికన్నా కమెడియన్స్ వెన్నెల కిశోర్, సత్యల మధ్య నడిచే కామెడీ ట్రాక్ థియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందట.

    Aadavallu Meeku Johaarlu

    వీరిద్దరు కలిసి వేరే లెవల్ కామెడీని అందించనున్నారట. దేవిశ్రీప్రసాద్ సంగీతం, కిషోర్ తిరుమల నడిపించిన కథనం, శర్వానంద్, రష్మికలతో పాటు సినిమాలోని ప్రతి ఒక్క నటుడు/నటి అద్భుతంగా చేశారని.. కరోనా తర్వాత పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అని చెప్పుకోవచ్చని సెన్సార్ రిపోర్ట్. మొత్తానికి అనుకున్న దాని కన్నా మరింత పాజిటివ్ రిపోర్ట్ ను సొంతం చేసుకున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాకు సెన్సార్ క్లీన్ ‘U’ సర్టిఫికేట్ ఇచ్చింది.

    Also Read: సుడిగాలి సుధీర్ కు మళ్లీ పెళ్లి.. ఈసారి ఆ కొత్త అమ్మాయి ఎవరో తెలుసా?

    Tags