
మోహన్ బాబు నట వారసుడిగా తెరంగేట్రం చేసిన మంచు విష్ణు పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. పదిహేడేళ్ల సినీ కెరీర్లో చేసిన దాదాపు 20 చిత్రాల్లో ‘డీ’, ‘దేనికైనా రెడీ’ మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఎనిదేళ్ల నుంచి విజయం మొహం చాటేసినా విష్ణు వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, అతని చిత్రాలు విడుదలయ్యాయి అని తెలిసేలోపు థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. తన చివరి చిత్రాలు ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇక లాభం లేదనుకున్న విష్ణు.. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రే గీ చిన్ ను లైన్‌లో పెట్టాడు. తానే ప్రొడ్యూస్ చేస్తూ ‘మోసగాళ్లు’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విష్ణు, కాజల్ కవలలుగా నటిస్తున్నట్లు సమాచారం. చిత్రంలో వీరిద్దరి పేర్లు అర్జున్, అను. నవదీప్, నవీన్ చంద్ర, బాలీవుడ్ నటుడు సుశీల్ శెట్టితో పాటు పలువురు హాలీవుడ్ నటులు భాగం అయ్యారు. ఇప్పటికే 80 శాతం పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.
జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!
కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు (జూన్ 19)ను సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఈ మూవీ తాజా పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. శివుడు పార్వతిలా…మంచు విష్ణు, కాజల్ ముఖాలను కలిపి డిజైన్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని ట్విట్టర్లో షేర్ చేసిన విష్ణు.. కాజల్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ ఆమె కళ్లు సెక్సీగా ఉన్నాయని పొడిగాడు. ‘హ్యాపీ బర్త్‌డే టు మై అమేజింగ్ టాలెంటెడ్ కాజల్ అగర్వాల్. చాలా సెక్సీగా ఉన్న ఇలాంటి పెద్ద కళ్లతో అదగొడుతూనే ఉండు’ అని ట్వీట్ చేశాడు.
Happy Birthday to my amazing talented @MsKajalAggarwal! Keep rocking girl with those sexy big eyes! Muah, Anu! #Mosagallu @SunielVShetty @theleapman @ruhisingh11 @pnavdeep26 @naveenc212 @sheldonchaudp pic.twitter.com/xEUyRnwfnO
— Vishnu Manchu (@iVishnuManchu) June 18, 2020
Thank you team #mossagallu @iVishnuManchu 💕🙏🏻 pic.twitter.com/KGzckbwrA0
— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 18, 2020