Prabhudeva Second Wife: ప్రభుదేవా మల్టీ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్. సుందరం మాస్టర్ కొడుకుగా పరిశ్రమలో అడుగుపెట్టాడు. గొప్ప డాన్సింగ్ స్కిల్స్ తో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్నారు. అనంతరం హీరోగా మారి సక్సెస్ అయ్యారు. దర్శకుడిగా పలు హిట్ చిత్రాలు తెరకెక్కించారు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వాంటెడ్ భారీ బ్లాక్ బస్టర్స్ గా ఉన్నాయి. ప్రొఫెషనల్ గా సక్సెస్ఫుల్ అయిన ప్రభుదేవా వ్యక్తిగత జీవితంలో పలు వివాదాలు ఉన్నాయి. భార్య రామలతతో విభేదాలు రచ్చకెక్కాయి.
హీరోయిన్ నయనతారను వివాహం చేసుకునేందుకు ప్రభుదేవ రామలతకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రామలత అందుకు నిరాకరించారు. ప్రభుదేవ, నయనతారలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. నయనతార-ప్రభుదేవల వివాహం ఖాయమే అని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా కొన్నాళ్లకు విడిపోయారు. మొదటి భార్యకు కూడా ప్రభుదేవ విడాకులు ఇచ్చారు.
అనంతరం 2020లో హిమని సింగ్ అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ టైం లో జరిగిన ఈ వివాహం గురించి పెద్దగా జనాలకు తెలియదు. నిరాడంబరంగా కానిచ్చేశారు. దీంతో హిమని సింగ్ ఫోకస్ కాలేదు. మొదటిసారి ఆమె కెమెరా ముందుకు వచ్చారు. ప్రభుదేవాకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. సదరు వీడియోలో ప్రభుదేవాను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన చాలా కేరింగ్, లవింగ్ పర్సన్ అన్నారు. ఈ మూడేళ్ల ప్రయాణంలో తన జీవితం అద్భుతంగా ఉందని. ఆయన అందంగా మార్చేశాడని కొనియాడారు.
హిమని సింగ్ తనదైన శైలిలో భర్తకు రొమాంటిక్ విషెస్ చెప్పారు. వీడియోలో భార్య తనపై కురించిపించిన ప్రేమ చూసి ప్రభుదేవ మురిసిపోయాడు. హిమని ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ప్రభుదేవా భార్య అందంగా ఉందని పలువురు కొనియాడుతున్నారు. హిమని సింగ్ ముంబైలో ఫిజీషియన్ గా చేస్తున్నారు. వీరిద్దరికి పరిచయం ఎలా అయ్యింది. ఎలా ప్రేమ కుదిరిందనేది తెలియదు. ప్రభుదేవాకు మొదటి భార్యతో ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్దబ్బాయి క్యాన్సర్ తో కన్నుమూశాడు.
View this post on Instagram