
Pooja Hegde : పరిశ్రమలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. హిట్ కొట్టిన వాళ్ళకే ఇక్కడ చోటు ఉంటుంది. హీరో, హీరోయిన్, దర్శకుడు,నిర్మాత… ఎవరికైనా సక్సెస్ చాలా అవసరం. పూజా హెగ్డేకు ఇప్పుడు కావాల్సింది అదే. దాని కోసం అనేక పాట్లు పడుతుంది. కారణం పూజ ఏకంగా ఐదు ప్లాప్స్ ఇచ్చింది. ఆమె హీరోయిన్ గా నటించిన ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్, సర్కస్ దారుణ పరాజయాలు చవిచూశాయి. ఎఫ్3 కూడా కలుపుకుంటే ఐదు ప్లాప్స్.

ఇది ఆమె కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపింది. కొన్ని క్రేజీ ఆఫర్స్ చేజారాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కి జంటగా పూజా హెగ్డేను అనుకున్నారు. ఆమె ప్లేస్ లో శ్రీలీలను తీసుకున్నారు. అనుకున్న సమయానికి హరీష్ శంకర్-పవన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే పూజా ఈ ప్రాజెక్ట్ కోల్పోయేది కాదు. ఒక దశలో మహేష్ మూవీ నుండి కూడా పూజాను తీసేశారనే ప్రచారం జరిగింది. డైరెక్టర్ త్రివిక్రమ్ కావడంతో పూజా సీటుకు చేటు రాలేదు.

పరిస్థితి ఇంత కఠినంగా ఉన్న తరుణంలో పూజా ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యింది. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్ర ప్రమోషన్స్ కోసం విపరీతంగా కష్టపడుతుంది. వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. గతంలో ఎన్నడూ పూజా ఓ చిత్ర ప్రమోషన్స్ కోసం ఇంతలా కష్టపడలేదు.

సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఫర్హాన్ సామ్జీ తెరకెక్కించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్ర అడ్వాన్స్ బుకింగ్ భయపెడుతున్నాయి . సల్మాన్ గత చిత్రాలతో పోల్చితే చాలా డల్ గా ఉన్నాయని ట్రేడ్ వర్గాల వాదన. ఆయన ఫేవరెట్ సీజన్ రంజాన్ కి వస్తున్నప్పటికీ వసూళ్లు ఇలా నిరాశాజనకంగా ఉండటం ఊహించని పరిణామం. ఈ క్రమంలో సినిమాకు హైప్ తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తుంది.

గ్రీన్ ట్రెండీ వేర్లో వంగి వంగి అందాల ప్రదర్శన చేసింది పూజా. హాట్ సిట్టింగ్ ఫోజుల్లో టెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. పూజా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. కిసీ కా జాన్ కిసీ కీ జాన్ ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. వెంకటేష్ పూజా హెగ్డే అన్న పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు విలన్, రామ్ చరణ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.
