https://oktelugu.com/

Visa : వీసా లేకుండా భారతీయులు వెళ్లే దేశాలేంటో తెలుసా?

Visa : వేసవి కాలం వచ్చేసింది. సెలవులు ఇచ్చారు. దీంతో దేశంలోని విదేశాల్లోని పలు ప్రాంతాలు చుట్టి రావాలని అందరు చూస్తుంటారు. కానీ వీసా, పాస్ పోర్టు లేని కారణంగా వెళ్లలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో వీసా, పాస్ పోర్టు లేకున్నా కొన్ని దేశాలు మనం చుట్టి రావచ్చు. దీంతో వాటిని సందర్శించేందుకు ప్లాన్ చేసుకోవడం మంచిది. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు మనం తిరిగే దేశాలు ప్లాన్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. గాబరా పడకుండా నిదానంగా వాటిని […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 19, 2023 / 05:47 PM IST
    Follow us on

    Visa : వేసవి కాలం వచ్చేసింది. సెలవులు ఇచ్చారు. దీంతో దేశంలోని విదేశాల్లోని పలు ప్రాంతాలు చుట్టి రావాలని అందరు చూస్తుంటారు. కానీ వీసా, పాస్ పోర్టు లేని కారణంగా వెళ్లలేకపోతుంటారు. ఈ నేపథ్యంలో వీసా, పాస్ పోర్టు లేకున్నా కొన్ని దేశాలు మనం చుట్టి రావచ్చు. దీంతో వాటిని సందర్శించేందుకు ప్లాన్ చేసుకోవడం మంచిది. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు మనం తిరిగే దేశాలు ప్లాన్ చేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. గాబరా పడకుండా నిదానంగా వాటిని చుట్టుముట్టి ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి గాను పక్కా ప్రణాళిక అమలు చేసుకోవడం సురక్షితం.

    మనం 14రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండకపోతే మన పక్కనే ఉన్న భూటాన్ దేశం పోవడం ఉత్తమం. భారతదేశానికి పొరుగునే ఉన్న దేశం కావడంతో ఇక్కడ పర్యటించడం మనకు పెద్దకష్టమేమీ కాదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ కూడా సుందరమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫిజీలో 120 రోజుల పాటు వీసా లేకుండా ప్రయాణించొచ్చు. దాదాపు నాలుగు నెలలపాటు వీసా లేకుండా సందర్శించవచ్చు.

    బార్బడోస్ కరేబియన్ దేశాలలో ఒకటి. ఇక్కడ ఉష్ణమండల ద్వీప ప్రేమికులకు స్వర్గధామం. విలాసవంతమైన హోటళ్లు ఉన్నాయి. బార్బడోస్ భారతీయులకు వీసా రహిత దేశం. వీసా లేకుండా ఇక్కడ 90 రోజులు ఉండొచ్చు. కాబట్టి ఇక్కడకు వెళ్లడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సెయింట్ విన్సెంట్ లో వీసా లేకుండా 30 రోజులు ఉండగలం. ఇక్కడ కూడా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.

    ట్రినిడాట్, టొబాగో ఒక ద్వీప దేశం. ఇక్కడ కూడా వీసా లేకుండా 90 రోజులు ప్రయాణం చేయొచ్చు. వన్యప్రాణులకు అనువైన ప్రదేశం. ఇక్కడ రకరకాల పక్షులు ఉంటాయి. జమైకాలో కూడా వీసా లేకుండా తిరగొచ్చు. ఇక్కడ పర్వతాలు, ద్వీపాలు ఎన్నో మనకు కనువిందు చేస్తాయి. కజకిస్తాన్ లో 14 రోజుల పాటు వీసా లేకుండా తిరగొచ్చు. ఇక్కడ కూడా అందమైన ప్రదేశాలు, సుందరమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇలా భారతీయులు విదేశాలకు వెళ్లాలనుకుంటే వీటిని ఎంచుకుని వెళితే మంచిది.

    Tags