https://oktelugu.com/

Manchu Manoj – Mounika : మౌనిక నేను చెన్నై పారిపోయాం, రహస్యంగా ఏడాదిన్నర కాపురం చేశాం… మనోజ్ సంచలన కామెంట్స్

Manchu Manoj – Mounika : భూమా మౌనికను దక్కించుకునేందుకు మనోజ్ పెద్ద యుద్ధమే చేశాడనిపిస్తుంది. చివరికి కెరీర్ ని కూడా పణంగా పెట్టాడని తాజా కామెంట్స్ ద్వారా అర్థం అవుతుంది. ‘అలా మొదలైంది’ టాక్ షోలో పాల్గొన్న మౌనిక-మనోజ్ సంచలన విషయాలు బయటపెట్టారు. చాలా కాలం క్రితం మనోజ్ అహం బ్రహ్మస్మి టైటిల్ తో ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 19, 2023 / 05:29 PM IST
    Follow us on

    Manchu Manoj – Mounika : భూమా మౌనికను దక్కించుకునేందుకు మనోజ్ పెద్ద యుద్ధమే చేశాడనిపిస్తుంది. చివరికి కెరీర్ ని కూడా పణంగా పెట్టాడని తాజా కామెంట్స్ ద్వారా అర్థం అవుతుంది. ‘అలా మొదలైంది’ టాక్ షోలో పాల్గొన్న మౌనిక-మనోజ్ సంచలన విషయాలు బయటపెట్టారు. చాలా కాలం క్రితం మనోజ్ అహం బ్రహ్మస్మి టైటిల్ తో ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అలా మొదలైంది షోలో హోస్ట్ వెన్నెల కిషోర్ ఈ ప్రస్తావన తెచ్చారు.

    అహం బ్రహ్మస్మి మూవీ ఏమైందని అడిగారు. మనోజ్ సమాధానంగా… ఆ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాము. నా మిత్రుడు రామ్ చరణ్ ఓపెనింగ్ కి వచ్చాడు. అహం బ్రహ్మస్మి సినిమానా లేక మౌనికతో ప్రేమనా? అనే ఒక సందిగ్ధత పరిస్థితి ఏర్పడింది. ఈ రెంటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. నన్ను నమ్మి ఒక అమ్మాయి ఉంది. అలాంటప్పుడు డబ్బు కోసమో, కెరీర్ కోసమో నేను అటువైపు వెళితే బ్రతికినా వేస్ట్. అలా బ్రతకలేను కూడా. అందుకే నేను మౌనిక, బాబును ఎంచుకున్నాను.

    ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందని మౌనిక, బాబును తీసుకుని చెన్నై వెళ్లిపోయాం. అక్కడ ఏడాదిన్నర ఉన్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు. నిజాయితీగా బ్రతికే వాళ్లకు కష్టాలు ఎక్కువగానే వస్తాయి. మౌనిక, నేను అనేక కష్టాలు పడ్డాము. అహం బ్రహ్మస్మి డైరెక్టర్ శ్రీకాంత్ కి నేను సారీ చెప్పాను. ఇప్పుడు శ్రీకాంత్ హీరో వైష్ణవ్ తేజ్ తో మూవీ చేస్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అహం బ్రహ్మస్మి భవిష్యత్ లో ఖచ్చితంగా చేస్తాను. ముందు వేరే చిత్రాల్లో నటించి కొంచెం డబ్బులు కూడబెట్టి నేనే నిర్మిస్తాను… అన్నారు.

    పెళ్ళికి ముందు మౌనికతో మనోజ్ సహజీవనం చేసినట్లు ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. భూమా మౌనికకు మొదటి భర్తతో ఒక కొడుకు పుట్టాడు. ఆ కుర్రాడి పేరు ధైరవ్ రెడ్డి. మౌనికను మోహన్ బాబు వ్యతిరేకించడానికి ఇది కూడా కారణం కావచ్చు. మౌనిక కొడుకును మంచు విష్ణు, మోహన్ బాబు ఒప్పుకోకపోయి ఉండొచ్చు. కానీ మనోజ్ వారందరితో యుద్ధం చేసి మౌనికను దక్కించుకున్నాడు. కోరుకున్నట్లు మౌనికను భార్యగా తెచ్చుకున్నారు. మార్చి 3న హైదరాబాద్ లో మౌనిక-మనోజ్ ల వివాహం జరిగింది.