Ketika Sharma Brother: టాలీవుడ్ లో ప్రతీ ఏడాది కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు , కొంతమంది హీరోయిన్స్ కి హిట్ వచ్చినా అవకాశాలు రావు, మరికొంత మంది హీరోయిన్ కి ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ రెండవ క్యాటగిరీ కి చెందిన హీరోయిన్స్ కి అదృష్టం మామూలుది కాదు అనే చెప్పాలి. కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లేకపోయినా కూడా స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు సంపాదిస్తూ ఉంటారు.
అలాంటి హీరోయిన్స్ లో ఒకరు కేతిక శర్మ. ఈ ఢిల్లీ బ్యూటీ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘రొమాంటిక్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా కేతిక శర్మ కి అవకాశాలు ఆగలేదు. ఈ చిత్రం తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చింది.

ఇప్పుడు ఈమె ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉండగా ఈ హీరోయిన్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఢిల్లీ లో పుట్టి పెరిగిన ఈమె తన చదువు పూర్తి అవ్వగానే మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఆడిషన్స్ జరుపుతున్న సమయం లో తన రొమాంటిక్ సినిమాకి హీరోయిన్ గా కేతిక శర్మ ని తీసుకున్నాడు.
ఈమె సోషల్ మీడియా లో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో ఎల్లపుడూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. తన వ్యక్తిగత ఫోటోలుకుటుంబానికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చెయ్యగా, ఈమె సోదరుడు ని చూసి నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు. అదిరిపోయే రేంజ్ కటౌట్ తో హాలీవుడ్ యాక్షన్ హీరో ని తలపించే విధంగా ఉన్న ఆయనని చూసి నెటిజెన్స్ నోరెళ్లబెడుతున్నారు.