Jammu and Kashmir Elections 2024 : మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మెహబూబా కూతురు.. ఎవరి బలం ఎంత?

సుదీర్ఘ విరామం తర్వాత.. అందమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఎన్నికల జరుగుతున్నాయి. దీంతో అందరి దృష్టి ఎన్నికలపైనే ఉన్నాయి.

Written By: NARESH, Updated On : September 17, 2024 6:08 pm

Jammu and Kashmir Elections 2024

Follow us on

Jammu and Kashmir Elections 2024 : 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేసింది. రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. ఇన్ని పరిణామాల తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది . జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని తొలి దశలో ఏడు జిల్లాల్లోని 24 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18న పోలింగ్ జరుగుతుంది. ఇందులో 23.27 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్లిప్ లు పంపిణీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మొదటి దశలో పోలింగ్ జరిగే 24 స్థానాలలో ఎనిమిది జమ్మూ డివిజన్ లో ఉన్నాయి. మిగతా 16 కాశ్మీర్ వ్యాలీ పరిధిలో ఉన్నాయి. ఇందులో గరిష్టంగా ఏడు స్థానాలు అనంత్ నాగ్ జిల్లాలో ఉన్నాయి. పుల్వామాలో నాలుగు, కుల్గామ్ జిల్లాలో మూడు, కిష్త్వారా, దోడా, షాపియాన్, రాంబన్ జిల్లాల్లోని రెండు సి నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.. జమ్మూ డివిజన్ పరిధిలో దోడా, రాంబన్, కిష్త్వారా జిల్లాలు ఉన్నాయి. అనంత్ నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్ జిల్లాలో కాశ్మీర్ డివిజన్ లో ఉన్నాయి. మొదటి దశలో 219 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 9 మంది మహిళలు, 92 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. పుల్వామా జిల్లాలోని పాంపోర్ స్థానంలో 14 మంది పోటీలో ఉన్నారు. అనంత్ జిల్లాలోని బిజ్ బెహరా స్థానంలో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. తొలి దశలో జరిగే ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల్లో 110 మంది లక్షాధికారులు. 36 మంది పై క్రిమినల్ కేసులున్నాయి. మెహబూబా ముక్తికి సంబంధించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీపడే 21 మంది అభ్యర్థుల్లో 18 మంది కోట్లకు పడగలెత్తారు.

ముఫ్తీ కుటుంబానికి కంచుకోటలో..

మెహబూబా ముఫ్తీ కుటుంబానికి బిజ్ బెహరా స్థానం పెట్టని కోటగా ఉంది. తొలి దశలో ఈ స్థానంలో పోలింగ్ జరుగుతుంది ఇక్కడ మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. మెహబూబా ముఫ్తీ , ఆమె తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రులుగా పని చేశారు. జమ్ము కాశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మూడు దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న తొలిదశ, సెప్టెంబర్ 25న రెండవ దశ, అక్టోబర్ 1న మూడోదశ ఎన్నికల జరుగుతాయి. అక్టోబర్ 8న ఫలితాలు విడుదలవుతాయి.

పది సంవత్సరాల క్రితం ఎన్నికలు

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు దక్కించుకుంది. బీజేపీ 25 సీట్లలో విజయం సాధించింది. ఈ రెండు పార్టీలు అప్పట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కొంతకాలం సవ్యంగానే జరిగినప్పటికీ.. రెండు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ఆ రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక అప్పటినుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన కొనసాగుతోంది. ఈలోగా కేంద్రం ఆర్టికల్ 370 ని రద్దు చేసింది. జమ్ము కాశ్మీర్ లో అభివృద్ధి పనులు చేయడం మొదలుపెట్టింది. సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విజయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.