Guess Photo: హీరోయిన్స్ తలదన్నేలా ఉన్న ఈ అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో కూతురు.. గుర్తు పట్టారా? వైరల్ ఫోటోస్

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన వాళ్లలో శ్రీకాంత్ ఒకరు. ఆయన మొదట్లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. హీరోగా మారి సక్సెస్ అయ్యాయి. ఓ వర్గం ప్రేక్షకులకు శ్రీకాంత్ చిత్రాలంటే ఇష్టం.

Written By: NARESH, Updated On : January 5, 2024 9:37 am

Guess Photo

Follow us on

Guess Photo: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో కూతురు. పట్టుచీరలో పదహారణాల తెలుగు పడుచులా ఉంది. అదే సమయంలో హీరోయిన్స్ కి మించిన గ్లామర్. చూడగానే నచ్చేసే రూపం. కుందనపు బొమ్మలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో ఇప్పటికే మీరు గుర్తు పట్టి ఉంటారు. మీ గెస్ కరెక్టే. ఒకప్పటి స్టార్ హీరో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ కూతురే ఈ అమ్మాయి. పేరు మేధ. ఆమె ఏం చేస్తున్నారో తెలుసుకుందాం…

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన వాళ్లలో శ్రీకాంత్ ఒకరు. ఆయన మొదట్లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. హీరోగా మారి సక్సెస్ అయ్యాయి. ఓ వర్గం ప్రేక్షకులకు శ్రీకాంత్ చిత్రాలంటే ఇష్టం. లవ్, రొమాంటిక్, ఎమోషనల్, ఫ్యామిలీ, పేట్రియాటిక్… ఇలా అన్ని జానర్స్ ట్రై చేశారు. శ్రీకాంత్ హీరోయిన్ ఊహను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఊహ కన్నడ అమ్మాయి.

ఊహ, శ్రీకాంత్ ఆమె చిత్రంలో కలిసి నటించారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఆమె సూపర్ హిట్. పెళ్లయ్యాక ఊహ నటనకు గుడ్ బై చెప్పారు. 1997లో వీరి వివాహం ఘనంగా జరిగింది. శ్రీకాంత్-ఊహ లకు ముగ్గురు సంతానం. పెద్దబ్బాయి రోషన్. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. రోషన్ ప్రస్తుతం మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీలో కీలక పాత్ర చేస్తున్నారు.

రెండో సంతానం అమ్మాయి. ఆమె పేరే మేధ. ఈమె ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ మైంటైన్ చేయడం లేదు. అందుకే మేధ గురించి తెలిసిన సమాచారం తక్కువే. చాలా అరుదుగా పబ్లిక్ లోకి వస్తారు. అది కూడా పేరెంట్స్ తో మాత్రమే. తాజాగా ఆమె కుటుంబ సభ్యులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆమె లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం మేధ చదువుకుటుంటున్నట్లు సమాచారం. ఆమె టీనేజ్ జస్ట్ క్రాస్ చేశారు. మరి నటనను కెరీర్ గా ఎంచుకుంటారా? లేక ఇతర రంగాల్లో రాణిస్తారా? అనేది చూడాలి. శ్రీకాంత్ చిన్న కొడుకు పేరు రోహన్.