Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ 8 హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో కేవలం ఒకరిద్దరు తప్ప ఆడియన్స్ కి పెద్దగా ముఖ పరిచయం లేని వాళ్ళే ఉన్నారు. కానీ సీజన్ కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో ఆసక్తికరంగా షో సాగిపోతుంది. మొదటి వారం పూర్తి అయ్యేసరికి బెబక్క ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు విష్ణు ప్రియా, నైనిక, నిఖిల్, నాగ మణికంఠ, శేఖర్ బాషా , ఆదిత్య ఓం , పృథ్వీ, సీత నామినేట్ అయ్యారు. వీరిలో మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చిన నాగ మణికంఠ, విష్ణు, పృథ్వీ, శేఖర్ బాషా వంటి వారు రెండవ వారం లో కూడా వచ్చారు. వీరిలో గత వారం నాగ మణికంఠ డేంజర్ జోన్ వరకు వెళ్లి వచ్చాడు అనే విషయం అందరికీ అర్థం అయిపోయింది. అంటే ఆయన ఎమోషనల్ డ్రామా కి ఆడియన్స్ ఏమాత్రం కనెక్ట్ కాలేదు అనేది అర్థం అవుతుంది. మరి ఈ వారం ఎలా నెట్టుకొస్తాడో చూడాలి. ఇది కాసేపు పక్కన పెడితే నాగ మణికంఠ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆయన పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా దర్శనం ఇస్తుంది. బిగ్ బాస్ షో లో తన భార్య వదిలేసింది అని నాగ మణికంఠ చెప్పడంతో ఇంతకు ఆయన భార్య ఎవరు, ఏమిటి అని ఆరాలు తీశారు నెటిజెన్స్. ఇంస్టాగ్రామ్ లో ఇతని ప్రొఫైల్ తెరిచి చూస్తే ఆడియన్స్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. నాగ మణికంఠ చూసేందుకు చాలా యంగ్ గా, అందంగా ఉంటాడు కదా, ఆయన భార్య కూడా అలాగే ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ మన ఊహలకు పూర్తి బిన్నంగా ఉంది మణికంఠ భార్య. ఆమెని చూడగానే వయస్సు నాగమణికంఠ కంటే చాలా పెద్దదిగా అనిపిస్తుందే అని ప్రతీ ఒక్కరికి అనిపించక తప్పదు. మణికంఠ తన పాపతో ఆడుకుంటున్న ఫోటోలు కూడా బయటకి వచ్చాయి.
అయితే తనకు ఎవ్వరూ లేరు, అందరూ నన్ను వదిలేసారు అని ఎమోషనల్ డ్రామా ఆడిన నాగ మణికంఠ, చెప్పింది మొత్తం అబద్దాలే అని ఈ ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. మణికంఠ తండ్రి ఈయన పెళ్ళికి వచ్చి సంతోషంగా ఆశీర్వదించి వెళ్ళాడు. ఇక్కడ షో లో మాత్రం ఆయన మా అమ్మ మృత దేహానికి అంత్యక్రియలు చేసేందుకు కట్టెలు కొనడానికి కూడా డబ్బులు పోగు చెయ్యాల్సి వచ్చింది అంటూ సినిమాల్లోని భారీ ఎమోషనల్ డైలాగ్స్ కొట్టి కంటెస్టెంట్స్ అందరినీ ఏడిపించేసాడు. జనాలు ఇవన్నీ చూసే అతనికి ఓట్లు వేయడం తగ్గించారని, అందుకే గత వారం ఎలిమినేషన్ వరకు వచ్చాడని అంటున్నారు. మరి మణికంఠ ఇకనైనా ఈ ఎమోషనల్ డ్రామాలు ఆపి గేమ్స్ ఆడుతాడా లేదా అనేది చూడాలి.