https://oktelugu.com/

Ravi Babu Son: కామెడీ విలన్ రవిబాబు కొడుకుని ఎప్పుడైనా చూసారా..? ఊర మాస్ హీరో రేంజ్ లో ఉన్నాడుగా..చూస్తే ఆశ్చర్యపోతారు!

సుమారుగా 7 ఏళ్ళ గ్యాప్ తీసుకొని దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత పలు వ్యాపారాలు చేసి అందులో రాణించిన రవిబాబు, 1998 వ సంవత్సరంలో జగపతి బాబు హీరో గా నటించిన 'మావిడాకులు' అనే చిత్రం ద్వారా క్యారక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 7, 2024 / 06:01 PM IST

    Ravi Babu Son

    Follow us on

    Ravi Babu Son: ఎలాంటి పాత్రల్లో అయినా పరకాయ ప్రవేశం చేసి, అద్భుతంగా జీవించగల క్యారక్టర్ ఆర్టిస్టులు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు చలపతి రావు. ఆయన కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రవిబాబు కూడా మంచిగా సక్సెస్ అయ్యాడు. క్యారక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్ గా, కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న రవిబాబు, దర్శకుడిగా కూడా విజయాలను అందుకున్నాడు. ఇతని ప్రతీ చిత్రం చూసే ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. 1991 వ సంవత్సరం లో ఈయన గంగ అనే చిత్రం ద్వారా హీరో గా వెండితెర అరంగేట్రం చేసాడు. కానీ ఆ సినిమా ఎప్పుడు విడుదలైందో, ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన హీరో గా సూట్ కానని, క్యారక్టర్ వేషాలు వేసుకోవడం ఉత్తమం అని గ్రహించాడు.

    Ravi Babu Son(1)

    సుమారుగా 7 ఏళ్ళ గ్యాప్ తీసుకొని దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత పలు వ్యాపారాలు చేసి అందులో రాణించిన రవిబాబు, 1998 వ సంవత్సరంలో జగపతి బాబు హీరో గా నటించిన ‘మావిడాకులు’ అనే చిత్రం ద్వారా క్యారక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో రవి బాబు కి అవకాశాలు క్యూలు కట్టాయి. అదే ఏడాది లో ఈయన పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత రవిబాబు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సినిమాలు చేస్తూ మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. 2002 వ సంవత్సరం లో ఈయన ‘అల్లరి’ అనే చిత్రం తో డైరెక్టర్ గా కూడా మారిపోయాడు. ఈ సినిమా ద్వారానే ‘అల్లరి’ నరేష్ మన ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయ్యాడు.

    ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత రవిబాబు తెరకెక్కించిన ‘పార్టీ’, ‘అనసూయ’, ‘నచ్చావులే’, ‘అమరావతి’, ‘అవును’,’మనసారా’, ‘నువ్విలా’ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. రవిబాబు సినిమా అంటే కచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిందే అనే రేంజ్ ఆడియన్స్ ని సంపాదించుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే రవిబాబు తనూజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు. వీళ్లిద్దరికీ ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. రీసెంట్ గానే తిరుమల దర్శనానికి రవిబాబు కుటుంబ సమేతంగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన తన కొడుకు, కూతురుని మీడియా కి పరిచయం చేసాడు. ఇద్దరు చూసేందుకు చాలా ముచ్చటగా ఉన్నాడు. కొడుకు కాస్త సన్నగా అయితే టాలీవుడ్ లోకి మాస్ హీరో గా ఎంట్రీ ఇవ్వొచ్చు.