https://oktelugu.com/

Pragya Nagra: అది ఒక పీడకల, లీకైన ప్రైవేట్ వీడియోపై ఎట్టకేలకు నోరు విప్పిన యంగ్ హీరోయిన్!

యంగ్ హీరోయిన్ ప్రగ్య నగ్ర ప్రైవేట్ వీడియో అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రియుడితో సదరు వీడియోలో ఆమె సన్నిహితంగా ఉన్నారు. క్షణాల్లో ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. ఎవరీ ప్రగ్య నగ్ర అని సెర్చ్ చేశారు. కాగా ఈ ఘటనపై ప్రగ్య నగ్ర స్పందించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : December 7, 2024 / 06:07 PM IST

    Pragya Nagra

    Follow us on

    Pragya Nagra: హర్యానాకు చెందిన ప్రగ్య నగ్ర 2022లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. జీవా హీరోగా నటించిన తమిళ చిత్రం వలరారు ముక్కియమ్ ఆమె డెబ్యూ మూవీ. అనంతరం N4 టైటిల్ తో మరొక తమిళ చిత్రం చేసింది. మలయాళంలో నదికదుల్ సుందరి యమున టైటిల్ తో విడుదలైన మలయాళ చిత్రంలో ఆమె నటించారు. లగ్గం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. లగ్గం మూవీలో రాజేంద్రప్రసాద్, రోహిణి, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, సప్తగిరి వంటి స్టార్ క్యాస్ట్ నటించారు.

    అక్టోబర్ 25న విడుదలైన లగ్గం మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. నటిగా ప్రయత్నాలు చేస్తున్న ప్రగ్యకు ఊహించని దెబ్బ తగిలింది. సడన్ గా ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యింది. ఈ వీడియో పై ప్రగ్య నగ్ర సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ ప్రైవేట్ వీడియో నాది కాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికలో ఓ పోస్ట్ పెట్టారు.

    ఇంకా షాక్ లోనే ఉన్నాను. ఇదంతా ఒక పీడ కల అయితే బాగుండు అనిపిస్తుంది. సాంకేతికత మనకు మంచి చేయాలి. చెడు కాదు. కానీ అది మన జీవితాలను అత్యంత దుర్భరంగా మార్చేస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వాడి ఇలాంటి వీడియోలు చేస్తున్న రాక్షసులను చూస్తుంటే జాలి వేస్తుంది. నేను స్ట్రాంగ్ గా ఉండటానికి ట్రై చేస్తున్నాను. అలాగే ఈ విషయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాలా మరో మహిళకు జరగకూడదని కోరుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి… అని ప్రగ్య నగ్ర కామెంట్ పోస్ట్ చేసింది.

    ఆమె సైబర్ క్రైమ్ విభాగాన్ని తన ట్వీట్ కి లింక్ చేశారు. కాగా రష్మిక మందాన, కాజోల్, ప్రియాంక చోప్రా తో పాటు పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. రష్మిక మందాన ఫేక్ వీడియో పై పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగింది. చివరికి గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఆ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని తెలిసింది. అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా ప్రగ్య నగ్ర కూడా ఫేక్ వీడియో వలన మానసిక వేదనకు గురైనట్లు వెల్లడించారు.