https://oktelugu.com/

Bollywood : ఈ బాలీవుడ్ స్టార్ హీరోల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయా..? కారణం ఏంటి..?

అక్షయ్ కుమార్ మీద కూడా ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి అంటూ ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు... ఇక ఇదిలా ఉంటే ఖాన్ త్రయంలో 'అమీర్ ఖాన్' మాత్రం ఇప్పటికీ మరొక సినిమా అనౌన్స్ చేయకుండా కామ్ గా ఉంటున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2024 / 10:22 AM IST

    Has the quarrel started between these Bollywood star heroes

    Follow us on

    Bollywood : ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలంగా ఉంది. అక్కడ ఏ హీరో కూడా సక్సెస్ ని సాధించలేకపోతున్నారు. నిజానికి బాలీవుడ్ హీరోల మధ్య ఒకప్పుడు విపరీతంగా పోటీ అయితే ఉండేది. ఎవరి సినిమా ఏ రికార్డును బ్రేక్ చేస్తుంది అంటూ ఆయా హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఎందుకంటే సౌత్ సినిమాలు బాలీవుడ్ ని ఏలుతున్న రోజులు వచ్చాయి. కాబట్టి అక్కడి హీరోలను పట్టించుకునే నాధుడు కూడా ఎవరూ లేరు అంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం కామెంట్లు చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ తను తీస్తున్న ‘సర్ఫీరా’ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

    ఇక ఆ సినిమా విశేషాలను చెబుతూనే బాలీవుడ్ లో తన ఫెయిల్యూర్స్ ని కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారంటూ కొన్ని ఘాటు కామెంట్లైతే చేశాడు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడి హీరోలందరూ ఇన్ఫిరియార్టి కాంప్లెక్స్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సౌత్ వాళ్ళు వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ లను కొడుతున్న క్రమంలో అక్కడ హీరోలెవరు సక్సెస్ లను కొట్టలేకపోతున్నారు. దానివల్ల బాలీవుడ్ హీరోలు ఎవరైనా సక్సెస్ కొడితే తమకంటే ముందు స్థానంలోకి వెళ్ళిపోతారనే ఉద్దేశ్యంతో కూడా వాళ్ళ హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు అనే వార్తలు కూడా బయటికి వస్తున్నాయి.

    ఇక అందులో అక్షయ్ కుమార్ మీద కూడా ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి అంటూ ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు… ఇక ఇదిలా ఉంటే ఖాన్ త్రయంలో ‘అమీర్ ఖాన్’ మాత్రం ఇప్పటికీ మరొక సినిమా అనౌన్స్ చేయకుండా కామ్ గా ఉంటున్నాడు. ఆయన ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడనే విషయాలైతే ఎవరికి అర్థం కావడం లేదు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ మరొక సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ట్రేడ్ పండితుల్లో సైతం ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన కొంతమంది రైటర్స్ తో కొన్ని కథలను రాయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    మరి ఆ కథలతోనే సినిమా చేసి మరోసారి భారీ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుపొందిన అమీర్ ఖాన్ ఏది చేసిన చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని మనందరికీ తెలిసిందే…అందుకే ఆయన కెరియర్ లో ఎన్నో భారీ సక్సెస్ లను అందుకున్నాడు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు తనను తాను స్టోరీల పరంగా, ఫిజికల్ గా, మెంటల్ గా తన మైండ్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఎలాంటి కథలు అయితే ఆడుతున్నాయో అలాంటి కథలతోనే మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తన సత్తా చాటడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని మరి కొంతమంది అభిమానులు తెలియజేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనప్పటికీ అమీర్ ఖాన్ తొందరగా బయటికి వచ్చి సినిమా చేస్తేనే పర్లేదు లేకపోతే మాత్రం ఇప్పుడు వస్తున్న హీరోల నుంచి ఎదురవుతున్న పోటీలో అమీర్ ఖాన్ ను చాలామంది అభిమానులు మర్చిపోయే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ ఒక భారీ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యం తోనే భారీ కసరత్తులను చేస్తూన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇన్ని రోజుల సైలెన్స్ వెనకాల ఒక పెను ప్రభంజనం దాగి ఉందని కూడా కొంతమంది భావిస్తున్నారు…చూడాలి మరి అమీర్ ఖాన్ కంబ్యాక్ ఎలా ఉండబోతుందనేది…