https://oktelugu.com/

Rashmika Mandanna: వామ్మో రష్మిక మందన 20 సార్లు ఆ స్టార్ హీరోను చెంప దెబ్బ కొట్టిందా?

యానిమల్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ అది కూడా రణ్ బీర్ కపూర్ సరసన సందీప్ వంగ డైరెక్షన్ లో ఈ అమ్మడు నటించి తన రేంజ్ ను అమాంతం పెంచేసుకుంది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 28, 2023 / 12:40 PM IST

    Rashmika Mandanna

    Follow us on

    Rashmika Mandanna: రష్మిక మందన ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై పాన్ ఇండియా సినిమాల్లో నటించే రేంజ్ కు ఎదిగింది అమ్మడు. కేవలం మూడు సినిమాలతోనే ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిందంటే మామూలు విషయం కాదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన ఈ అమ్మడుకు బాలీవుడ్ లో అవకాశాలు మెండుగా వస్తున్నాయి. అయితే మొదటి సినిమాతోనే రణ్ బీర్ కపూర్ తో అవకాశం రావడం, ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

    యానిమల్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ అది కూడా రణ్ బీర్ కపూర్ సరసన సందీప్ వంగ డైరెక్షన్ లో ఈ అమ్మడు నటించి తన రేంజ్ ను అమాంతం పెంచేసుకుంది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రూ. 900 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సలార్ సినిమా విడుదల అవడంతో యానిమల్ వసూళ్లు పడిపోయాయి. లేదా ఈ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేసి ఉండేదని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదిలా ఉంటే ఇందులో రష్మిక నటన అద్భుతం అనే చెప్పాలి.

    సందీప్ వంగ డైరెక్షన్ అంటే మామూలు విషయం కాదు. చాలా ఓపిక ఉండాల్సిందే. పర్ఫెక్ట్ టేక్ వచ్చేవరకు వదలరు ఈ డైరెక్టర్. తీసిన మూడు సినిమాలు ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేశాయంటేనే అర్థం చేసుకోవచ్చు సందీప్ పనితనం. ఇక అర్జున్ రెడ్డి టేకింగ్స్ చూసి తన డైరెక్షన్ కు ప్రతి ఒక్కరు వావ్ అనేశారు. అదే విధంగా యానిమల్ సినిమాలో కర్వా చౌత్ సన్నివేశానికి థియేటర్స్ లో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వచ్చిందో తెలిసిందే. ఈ సన్నివేశంలో రష్మిక రణబీర్ చెంప పగలగొడుతుంది.

    ఇక ఈ టేక్ ను ఒకసారి రెండు సార్లతో ఫినిష్ చేయలేదట సందీప్ వంగ. ఈ సీన్ ను తీయడానికి ఏకంగా 20 టేకులు తీసుకున్నారట. అంటే 20 సార్లు రష్మిక రణబీర్ చెంప పగలగొట్టింది. కానీ ఈ హీరో కూడా కొంచెం కూడా చిరాకు పడకుండా కూల్ గా ఉన్నారట. సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించారట. ఇక రణ్ బీర్ డెడికేషన్ ఉన్న నటుడు అని పొగడ్తలతో ముంచెత్తింది రష్మిక మందన. ఇక ఈ సినిమా తర్వాత ఆగస్టు 15న పుష్ప సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ అమ్మడు. ఇక ఈ సినిమాతో మరో సారి తన లక్ ను పరీక్షించుకోబోతుంది. మరి చూడాలి పుష్ప సినిమా ఎలా ఉండబోతుందో…