Rajinikanth : రజినీకాంత్ క్రేజ్ ఇంత పడిపోయిందా..? ‘వెట్టియాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతో చూస్తే ఆశ్చర్యపోతారు!

మన టాలీవుడ్ లో నాన్ రాజమౌళి రికార్డ్స్ అనే క్యాటగిరీ ఎలా ఉండేదో, కోలీవుడ్ లో నాన్ రజినీ రికార్డ్స్ అని అలాంటి క్యాటగిరీ ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ బాగా తగ్గిపోయింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయిన ఒక వయస్సు వచ్చిన తర్వాత బాక్స్ ఆఫీస్ స్టామినా తగ్గడం సర్వసాధారణం.

Written By: Vicky, Updated On : October 9, 2024 7:21 pm

Rajinikanth

Follow us on

Rajinikanth :  తమిళనాడు లో ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ బ్రాండ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అభిమానులు ఆయన్ని దేవుడిలాగా కొలుస్తారు, ఆయన సినిమా విడుదల అవుతుందంటే వారం వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తో థియేటర్స్ హౌస్ ఫుల్స్ అయ్యేవి. హిట్ అయితే వసూళ్ల విషయం లో ఆకాశమే హద్దు. 200 కోట్లు, 300 కోట్లు మన స్టార్ హీరోలు ఇప్పుడు కొడుతున్నారు. కానీ రజినీకాంత్ పదేళ్ల క్రితమే ఇలాంటివన్నీ చూసాడు. ఆయన నటించిన చిత్రాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యేవి. అలా ఉండేది ఆయన మేనియా. మన టాలీవుడ్ లో నాన్ రాజమౌళి రికార్డ్స్ అనే క్యాటగిరీ ఎలా ఉండేదో, కోలీవుడ్ లో నాన్ రజినీ రికార్డ్స్ అని అలాంటి క్యాటగిరీ ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ బాగా తగ్గిపోయింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయిన ఒక వయస్సు వచ్చిన తర్వాత బాక్స్ ఆఫీస్ స్టామినా తగ్గడం సర్వసాధారణం.

రజనీకాంత్ విషయం లో కూడా అదే జరిగింది. ఆయన వయస్సు ఇప్పుడు 73 ఏళ్ళు ఉంటాయి. ఈ వయస్సులో కూడా ఆయన టాక్ వస్తే 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతున్నాడు. అంతటి స్టార్ డమ్ ఉన్న హీరో ఆయన ఏజ్ గ్రూప్ లో ప్రస్తుతానికి ఎవ్వరూ లేరు. కానీ ‘నాన్ రజినీ రికార్డ్స్’ అనే స్థాయి బ్రాండ్ నుండి క్రిందకి పడిపోవడం అభిమానులకు కాస్త నిరాశకు గురి చేసిన విషయం. రీసెంట్ గానే ఆయన ‘జై భీం’ ఫేమ్ జ్ఞాన్ వేల్ రాజా దర్శకత్వం లో ‘వెట్టియాన్’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా పరవాలేదు అని అనిపించుకుంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అంతంత మాత్రం గానే జరిగాయి.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రానికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 12 కోట్ల 56 లక్షల రూపాయిలు వచ్చాయి. ఇప్పటికీ విజయ్ నటించిన బీస్ట్ చిత్రానిదే ఆల్ టైం రికార్డు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రానికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ని రజినీకాంత్ కొట్టడం ఇప్పట్లో కష్టమే. ‘నాన్ రజినీ రికార్డ్స్’ అని పిలబడే స్థాయి నుండి తన తోటి స్టార్ హీరో ఓపెనింగ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోవడాన్ని ఆయన ఇమేజ్ ఎంత పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.