NTR Prashanth Neel movie stopped: నందమూరి అభిమానులతో పాటు, మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘డ్రాగన్'(Dragon Movie). ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ పై అనేక సన్నివేశాలను చిత్రీకరించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే రీసెంట్ గానే ఆయన ఈ సినిమాకు సంబంధించిన షాట్స్ ని చూశాడట. ఎందుకో ఆయన ఇప్పటి వరకు తీసిన షూటింగ్ ఔట్పుట్ పై సంతృప్తి గా లేదట. అందుకే మొత్తం మళ్లీ రీ షూట్ చెయ్యాలని చూస్తున్నాడట. అంతే కాదు స్క్రిప్ట్ లో కూడా భారీ మార్పులు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి 45 రోజుల షూటింగ్ జరిగింది. ఇదంతా ఇప్పుడు వృధా అయినట్టే అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతుందట. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించి, కొంత కాలం గ్యాప్ తీసుకొని, ఈ సినిమా స్క్రిప్ట్ కి చేయాల్సిన రిపేర్లు చేసి మళ్లీ షూటింగ్ ని పునః ప్రారంభించాలని అనుకుంటున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అందుకు తగ్గట్టుగానే ఆయన అడుగులు వేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి ఒక కీలక పాత్ర చేస్తున్నాడట. ఆయనకు సంబంధించిన షూటింగ్ ని ప్రస్తుతం సైలెంట్ గా కానిచ్చేస్తున్నారట. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. కానీ ఇప్పుడు షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడం తో సినిమా కూడా వాయిదా పడుతుందేమో చూడాలి. ఈ చిత్రానికి రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నాడు.
ఎన్టీఆర్ కి ఇప్పుడు సరైన బ్లాక్ బస్టర్ హిట్ తప్పనిసరిగా కావాలి. టెంపర్ నుండి దేవర వరకు నాన్ స్టాప్ గా హిట్స్ అందుకుంటూ వస్తున్న ఆయనకు రీసెంట్ గా విడుదలైన ‘వార్ 2 ‘ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇంతటి ఫ్లాప్ ఎన్టీఆర్ కెరీర్ లోనే లేదు. మొదటి రోజు కొన్ని ప్రాంతాల నుండి రావాల్సిన వసూళ్లు, ఫుల్ రన్ లో కూడా రాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ని చూసి ఎన్టీఆర్ పై పడిన ట్రోల్స్ ని చూసి అభిమానులు తీవ్రమైన నిరాశలో ఉన్నారు. వాళ్ళను ఈ నిరాశ నుండి ప్రశాంత్ నీల్ చిత్రం బయటకు తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి.