Kamal Haasan: కమలహాసన్ సినిమాను హాలీవుడ్ వాళ్ళు కాపీ చేశారా.? ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?

మన సినిమాలని కూడా హాలీవుడ్ వాళ్లు కాపీ చేస్తు ఉంటారు అనే విషయం చాలా మంది కి తెలియదు. ఏంటి నమ్మడానికి ఇబ్బంది గా ఉందా అయిన కూడా నమ్మాలి .

Written By: Gopi, Updated On : May 11, 2024 12:26 pm

Has Hollywood copied Kamal Haasan movie

Follow us on

Kamal Haasan: సినిమా ఇండస్ట్రీలో ఒక భాష లో సక్సెస్ అయిన సినిమాని మరొక భాష లో అఫిషియల్ గా సినిమా రైట్స్ తీసుకొని రీమేక్ చేస్తే స్తే ఏ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఒక ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సినిమాలోని కొన్ని సీన్స్ గాని, స్టోరీని గాని అనాఫిషియల్ గా తీసుకొని సినిమా చేస్తే మాత్రం అది చాలా పెద్ద క్రైమ్ అనే చెప్పాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అయితే మనకు తెలిసింది ఏంటి అంటే మనవాళ్లు హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కాపీ చేస్తూ ఇక్కడ సినిమాలు చేస్తారని అందరూ అనుకుంటారు.

కానీ మన సినిమాలని కూడా హాలీవుడ్ వాళ్లు కాపీ చేస్తు ఉంటారు అనే విషయం చాలా మంది కి తెలియదు. ఏంటి నమ్మడానికి ఇబ్బంది గా ఉందా అయిన కూడా నమ్మాలి .ఎందుకంటే వాళ్ళు మన చాలా సినిమాల్ని కాపీ చేసి సినిమాలు తీస్తున్నారు కాబట్టి. ఇక హాలీవుడ్ వాళ్ళు కాపీ చేసిన మన సినిమాల్లో కమలహాసన్ హీరోగా వచ్చిన ‘ఉత్తమ విలన్’ ఒకటి… ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి స్టోరీని కమలహాసన్ అందించారు. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. ఇక ఇదే పాయింట్ తో 2017 వ సంవత్సరంలో హాలీవుడ్ లో ‘ద హీరో’ అనే ఒక సినిమా వచ్చింది.

ఇక ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అంటే ఓల్డ్ ఏజ్ లో ఉన్న ఒక హీరో క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉండడంతో తను చివరగా తన డ్రీమ్ రోల్ అయిన ఒక పాత్రలో నటించి చనిపోవాలనుకుంటాడు. ఇక ఈ ప్రాసెస్ లోనే ఒక సినిమాని స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ లోపల తనకి చాలా ఇష్టమైన తన కూతురిని కలుసుకుంటాడు. ఇలా తనలో ఎమోషన్స్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి.

ఉత్తమ విలన్ సినిమా కథ కూడా ఇదే.. ఇక 2015 లో ఉత్తమ విలన్ సినిమా వస్తే, 2017లో ఈ సినిమా స్టోరీ ని కాఫీ చేసి ది హీరో పేరుతో హాలీవుడ్ లో తీశారు. ఇక మొత్తానికైతే మన సౌత్ సినిమాలను కూడా హాలీవుడ్ వాళ్ళు కాపీ చేస్తున్నారు అంటే నిజంగా మన మేకర్స్ చాలా గొప్ప వాళ్ళనే చెప్పాలి..