Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనందరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక హీరోలను స్టార్లు గా మార్చడం లో దర్శకులు కీలకపాత్ర వహిస్తుంటారు…ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ సైతం ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ తో చేసిన ‘రంగస్థలం’ సినిమా ఒక క్లాసిక్ మూవీ అనే చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత చేసిన పుష్ప సిరీస్ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ప్రస్తుతం మరోసారి రామ్ చరణ్ తోనే సినిమా చేస్తున్న ఆయన ఆ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి… ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండడం విశేషం… ఇక ఇప్పటికే శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినినిమాతో భారీ ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన పెద్ద సినిమా ప్రొడ్యూస్ చేయలేనని చెప్పినప్పటికి సుకుమార్ తో తనకున్న అనుబంధం వల్ల d రాజు సుకుమార్ తో సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు.
ఇక ఇప్పటికే ప్రభాస్ ను హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయిన దిల్ రాజు ఇప్పుడు ప్రశాంత్ వర్మ ప్లేస్ లో సుకుమార్ ప్రభాస్ కాంబినేషన్ సినిమాను సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. సుకుమార్ ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది కూడా చర్చనీయంశంగా మారింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు సుకుమార్, ఇటు ప్రభాస్ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు…
వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని ప్రభాస్ అభిమానులు చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు.మొత్తానికైతే సినిమా ఇప్పుడు వర్కౌట్ అవుతున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమా మీద భారీ బడ్జెట్ ని కేటాయించి సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజుకి ఇతర ప్రొడక్షన్ హౌస్ ల నుంచి కొంతవరకు పోటీ ఎదురవుతోంది.
ప్రతి చిన్న ప్రొడక్షన్ హౌస్ కూడా భారీ బడ్జెట్ తో సినిమాలను చేసి ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో దిల్ రాజు మాత్రం భారీ సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. భారీ బడ్జెట్ తో చేసిన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నందు వల్ల ఆయన మీడియం రేంజ్ సినిమాలకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఇప్పుడు స్టార్ హీరోలతో పెద్ద సినిమాలను ప్లాన్ చేసి సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే ఆయన బ్యానర్ చాలా వరకు వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన అలాంటి డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది…