Harsha Vardhan comments: ప్రముఖ నటుడు రీసెంట్ గా ఒక మూవీ ఫంక్షన్ లో హీరోయిన్స్ ధరించే దుస్తుల పై చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా లో ఒక పది రోజుల పాటు ఈ అంశం పై వాడివేడి చర్చలు నడిచాయి. యాంకర్ అనసూయ దీనిపై స్పందించడం, ఆ తర్వాత యూట్యూబర్ అన్వేష్ నోరు జారీ మాట్లాడుతూ ఏకంగా హిందూ దేవుళ్ళ పై నోరు జారే రేంజ్ కి వెళ్లడం, అతని పై కేసులు నమోదు అవ్వడం, ఇలా ఒక్కటా రెండా, ఈ ఒక్క అంశం చుట్టూ ఎన్నో వివాదాలు జరిగాయి. అయితే ఈ అంశం పై ప్రముఖ నటుడు హర్ష వర్ధన్ (అమృతం ఫేమ్) రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు శివాజీ, అనసూయ లకు కౌంటర్లు ఇస్తున్నట్టుగా అనిపించింది.
ఆయన మాట్లాడుతూ ‘ దొంగల మనసులు మార్చే దానికన్నా, మన ఇంటికి తాళం వేసుకోవడం మంచిది అనే సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిని నేను. ఎందుకంటే నా ఇంటికి నేను తాళం వేసుకోవడం అనేది నా చేతుల్లో ఉన్న పని. నా ఇంట్లో ఉండే వాళ్లకు జాగ్రత్తగా ఉండమని చెప్పడం నాకు చాలా తేలికైన విషయం. అంతే కానీ, దొంగల్లారా, ఇలా చేయడం మంచిది కాదు, ఆలోచించండి అని చెప్తే వాళ్ళు వింటారా?. గత కొన్ని రోజులుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు గురించి ఆలోచిస్తే ఈ విషయం చాలా సులభంగా అర్థం అవుతుంది. ఎప్పుడూ కూడా రెండు టాపిక్స్ ని కలపకూడదు, స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడాలి, దుస్తుల గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడాలి , మంచి ఉద్దేశ్యం తో సమాజానికి ఏదైనా చేపట్టప్పుడు, మనం మాట్లాడే తీరు సరిగ్గా ఉండాలి , లేదంటే శివాజీ, అనసూయ లాగా అవుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు హర్ష వర్ధన్.
హర్ష వర్ధన్ అమృతం సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయిన సంగతి మనకి తెలిసిందే. ఈ సీరియల్ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. నటుడుగా మంచి గుర్తింపు ని తెచ్చుకున్న హర్ష వర్ధన్, గొప్ప రచయితా కూడా. మనం, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలకు ఆయన మాటలు అందించాడు. ఇకపోతే రీసెంట్ గానే ఆయన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లో ప్రధాన పాత్ర పోషించాడు. సినిమా లో చిరంజీవి ఎంత సేపు వెండితెర పై కనిపిస్తాడో, హర్ష వర్ధన్ కూడా దాదాపుగా అంత సేపు కనిపిస్తాడు. ఈ చిత్రం ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలివి. ఈ వ్యాఖ్యలపై శివాజీ, అనసూయలలో ఎవరైనా కౌంటర్ ఇస్తారేమో చూద్దాం.