Harsha Sai
Harsha Sai : తెలుగులో హర్ష సాయి అని..ఓ ఫేమస్ యూట్యూబర్ ఉన్నాడు. ఏడాది క్రితం ఓ సినిమాను అనౌన్స్ చేసి.. దానిని కోల్డ్ స్టోరేజ్ లోకి పంపించాడు. ఇటీవల ఓ యువతిని వేధించాడని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. దానికి సంబంధించి కేసు కూడా నమోదయింది. దాన్ని మర్చిపోకముందే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన కేసులో హర్ష సాయి పేరు వినిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. హర్ష సాయి పేదలకు డబ్బులు ఇస్తుంటాడు. వారి కష్టాలను చూసి చలించి పోతుంటాడు. ఆ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తుంటాడు. తద్వారా తన మీద ఉన్న హైప్ మరింత పెంచుకుంటాడు. (సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయన్సర్ అవతారం ఎత్తడానికి ఇది ఒక రకమైన ట్రిక్. ) ఇలా రకరకాల ట్రిక్కులు ప్లే చేసి హర్ష సాయి ఇప్పుడు తెలుగులో ఫేమస్ యూట్యూబర్ అయిపోయాడు. సోషల్ మీడియా బాగోతం తెలిసిందే కదా.. ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత గొప్పోడు అన్నట్టు.. ఫాలోవర్స్ తగ్గట్టుగానే.. వాచింగ్ అవర్స్ తగ్గట్టుగానే యూట్యూబ్ ఆదాయాన్ని ఇస్తూ ఉంటుంది.. ఈ ఆదాయం యూట్యూబర్లకు సరిపోవడం లేదు. అందువల్లే అడ్డదారులు తొక్కుతున్నారు. చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ మాత్రమే కాదు.. ఇంకా చాలా రకాలుగా ఆదాయాలను యూట్యూబర్లు సంపాదించుకుంటున్నారు.
Also Read : హర్ష సాయిపై కేసు.. మరి యాంకర్/వైసీపీ లేడి నేతను మరచిపోతారా?
అందుకోసమేనట..
యూట్యూబర్లు బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్లు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పెట్టి చాలామంది మోసపోయారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ తరహా ఫిర్యాదులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులకు పెరిగిపోవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. బెట్టింగ్ యాప్ లను తొక్కి నార తీయాలని భావించింది. ఇందులో భాగంగానే బెట్టింగ్ యాప్ లకు ఎవరైతే ప్రమోషన్లు చేస్తున్నారో.. వారందరిపై దృష్టి పెట్టింది. ఇందులో హర్ష సాయి కూడా ఒకడు. అయితే అతడు ఏమంటాడు అంటే..” బెట్టింగ్ యాప్ కు ప్రమోషన్ నేను చేయకుంటే.. లైన్ లో చాలామంది ఉన్నారు. వారు వాటి వినియోగాన్ని మరింత విస్తృతం చేస్తారు. తద్వారా మోసపోయే వారు పెరిగిపోతాయి. అలాంటివి జరగకుండా ఉండడానికి నేనే రంగంలోకి దిగాను. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాను. అలా వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని” ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.. సమాజ సేవ చేయాలంటే చేతిలో ఉన్న డబ్బులు లేదా.. కష్టపడిన డబ్బులు ఖర్చు పెట్టాలి. అలాకాకుండా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడి.. అలా వచ్చిన డబ్బుతో సమాజ సేవ చేస్తున్నామని హర్ష సాయి చెప్పడం చెప్పడం కాకులను కొట్టి గద్దలకు వేసిన సామెతను నిజం చేసి చూపిస్తోంది. అన్నట్టు ఇలాంటి వ్యక్తికి తెలుగులో యూట్యూబ్ వ్యక్తిగత విభాగంలో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉండడం నిజంగా విచారకరం.
Also Read : ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పేరుతో మరో మోసం..
Idendayya idi,idi nenu sudale
Chesedhe bokada pani
Malli dhaniko thuppas logic okatiThat comment says it all
Betting apps ni promote cheyyadam thappu analsindi poi,edo saamajika seva chestunnattu cheptunnadu #HarshaSai on promoting betting apps #SayNoToBettings pic.twitter.com/1ofws0Ck71— Vamc Krishna (@lyf_a_zindagi) March 18, 2025