https://oktelugu.com/

Harsha Sai : ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పేరుతో మరో మోసం..

గత ఏడాది సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయిన సెలబ్రిటీస్ లో ఒకరు హర్ష సాయి(Harsha Sai). ప్రముఖ యూట్యూబర్(Youtuber) గా ఇతనికి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

Written By: , Updated On : February 20, 2025 / 09:43 AM IST
Harsha Sai

Harsha Sai

Follow us on

Harsha Sai : గత ఏడాది సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయిన సెలబ్రిటీస్ లో ఒకరు హర్ష సాయి(Harsha Sai). ప్రముఖ యూట్యూబర్(Youtuber) గా ఇతనికి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇతని యూట్యూబ్ ఛానల్ కి దాదాపుగా కోటి 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే, ఆయన ఏ రేంజ్ సెలబ్రిటీ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే గత ఏడాది ఈయనపై ఒక మహిళా కేసు వేసిన ఘటన పెద్ద దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు హర్ష సాయి పేరుతో కొందరు దొంగలు మరో స్కాం చేశారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జల్ మండలానికి చెందిన బరిగెల ఆంజనేయులు అనే వ్యక్తి తండ్రి ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

తండ్రి చికిత్స కోసం డబ్బులు ఇబ్బంది అవ్వడంతో ఇంస్టాగ్రామ్ లోని హర్ష సాయి అకౌంట్ కి మెసేజ్ చేశాడు. ఇదే అదనుగా బావించించిన కొందరు దొంగలు హర్షసాయి పేరును వడుకొని కొందరు దొంగలు మోసం చేశారు.  కచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటామని, తక్షణమే చికిత్సకు అవసరమయ్యే నాలుగు లక్షల రూపాయిలు చెల్లిస్తామని. కాకపోతే డాక్యుమెంట్ చార్జెస్, ఆఫీస్ కి సంబంధించిన బ్యాక్ ఎండ్ చార్జెస్ మీరే చెల్లించాల్సి ఉంటుందని  చెప్పడంతో. ఆంజనేయులు తన తండ్రి చికిత్స కోసం దాచుకున్న 22 వేల 500 రూపాయిలను ఫోన్ పే ద్వారా పంపించాడు. అంతకు ముందు అడిగిన డబ్బులు పంపిన వెంటనే నాలుగు లక్షల రూపాయిలు పంపుతామని చెప్పిన ఆ దొంగలు కేవలం 5500 రూపాయిలు మాత్రమే ఫోన్ పే లో పంపించి, అ తర్వాత ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసారు. పాపం ఆంజనేయులు ఎంత ప్రయత్నం చేసిన అ దుండగులు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆంజనేయులు పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

హర్ష సాయి పేరుతో కొందరు దొంగలు మోసం చేశారని ఫిర్యాదు చేయగా కేసు ని నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా ఇలాగే హర్ష సాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, ఆ అమ్మాయి పై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కచ్చితంగా ఈ కేసు లో ఆయన ఆరెస్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ, అది జరగలేదు. ఇప్పుడు ఆయన పేరు వాడుకొని కొందరు దొంగలు మోసం చేశారు.. ఎన్నో ఏళ్ళ నుండి హర్ష సాయి ఛారిటీ వర్క్ చేస్తున్నాడు. ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు, మొట్టమొదటిసారి ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి, పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేపట్టొచ్చు.