Harsha Sai
Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయి అంటే తెలియనివారుండరు. ఈ యువకుడు పేదోళ్లకు సహాయం చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఇతడి దానాలు లక్షల్లో ఉంటాయి. ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళు ఇస్తాడు. విద్యార్థులకు స్కూల్ ఫీజులు చెల్లిస్తాడు. షాపు లేక ఇబ్బంది పడుతున్న బార్బర్ కి షాప్ ఏర్పాటు చేస్తాడు. వైద్యానికి డబ్బుల్లేని రోగులకు చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తాడు. అందరూ డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్ ఛానల్స్ పెడితే హర్ష సాయి మాత్రం తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా డబ్బులు పంచుతాడు.
తెలుగుతో పాటు పలు భాషల్లో హర్ష సాయి యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తాడు. కొన్నాళ్లుగా అతడి దానాలు కొనసాగుతున్నాయి. హర్ష సాయికి అసలు డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి? అసలు నిజంగానే అతడు దానం చేస్తున్నాడని కొందరు ఆరా తీశారు. హర్ష సాయి వీడియోలలో చూపించిన వాళ్ళను కలిసి మీరు అతన్నుండి సహాయం పొందారా? అని అడగడం జరిగింది. అందరూ తమకు హర్ష సాయి నిజంగానే డబ్బులు ఇచ్చాడని చెప్పుకొచ్చారు.
కలియుగ కర్ణుడిగా జనాల్లో ఇమేజ్ సొంతం చేసుకున్న హర్ష సాయి వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. అతడు హీరోగా ఏకంగా పాన్ ఇండియా మూవీ సిద్ధం చేస్తన్నారు. ఈ మేరకు వివరాలు అందుతున్నాయి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్ర టీజర్ సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారిక పోస్టర్ విడుదల చేశారు.
విశేషం ఏమిటంటే సీఎం కేసీఆర్ దగ్గర బంధువైన కల్వకుంట్ల వంశీధర రావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫేమ్ మిత్ర శర్మ నిర్మిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు, హీరోయిన్ వంటి విషయాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు. టీజర్ విడుదలకు మాత్రం రంగం సిద్ధమైంది. మరి యూట్యూబర్ గా సోషల్ మీడియాను షేక్ చేసిన హర్ష సాయి వెండితెరపై ఎలాంటి సంచలనాలు చేయనున్నాడో చూడాలి…
Our Next PAN INDIA PROJECT
Further Details Very Soon #ShreePictures #HarshaSai pic.twitter.com/iCOWp0VISX— Mitraaw (@Mitraaw_sharma) September 13, 2023