Harish Shankar : మైక్ పట్టుకుంటే చాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఎప్పుడూ ముందుండే సెలబ్రిటీలలో ఒకరు హరీష్ శంకర్(Harish shankar). ‘గబ్బర్ సింగ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ లో కచ్చితంగా అగ్ర స్థాయి దర్శకులలో ఒకరిగా నిలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన ట్రాక్ తప్పింది. హిట్స్ అయితే ఉన్నాయి కానీ, అవి ఆయన్ని మరో లెవెల్ కి తీసుకెళ్ళేవి మాత్రం కాదు. రీసెంట్ గానే రవితేజ తో ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రం చేసి భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి బలహీనమైన స్క్రీన్ ప్లే, నాసిరకమైన టేకింగ్ తో పాటు ప్రొమోషన్స్ లో హరీష్ శంకర్ మాట్లాడిన కొన్ని పొగరు మాటలు అని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని కమిట్ అయ్యాడు.
Also Read : నేను బాక్సింగ్ కి సంబందించిన సినిమా తీస్తే ఆయనే నా హీరో : హరీష్ శంకర్…
ఇదంతా పక్కన పెడితే నిన్న ఆయన ‘జింఖానా'(Jimkhana Movie) తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళం లో భారీ అంచనాల నడుమ విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఇదే సినిమాని తెలుగు ఈ నెల 25 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ ఈవెంట్ లో ముందుగా యాంకర్ హరీష్ శంకర్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘బాక్సింగ్ నేపథ్యం లో మీరు ఒక సినిమాని తియ్యాలని అనుకుంటే ఏ స్టార్ హీరో తో చేస్తారు?’ అని అడుగుతుంది. అప్పుడు ఆడియన్స్ అంతా ‘పవన్ కళ్యాణ్’ అని గట్టిగా అడగ్గా, హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘ప్రశ్న అడిగింది మిమ్మల్ని కాదు, నన్ను..నేను అయితే రామ్ చరణ్ తో చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. డ్రాగన్ మూవీ ని నేను ప్రమోట్ చేశాను. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన సినిమాలకంటే పక్క సినిమాలను ఎక్కువగా మన ఆడియన్స్ చూస్తున్నారు అని చెప్పగానే, చాలా మంది అనేక గాసిప్స్ రాసుకుంటూ వచ్చారు. నా గత సినిమా జనాలు చూడలేదని అలా చెప్పాడు అంటూ చెప్పుకొచ్చారు. మనకి బాగుగా అలవాటే కదా, పక్క రాష్ట్రాల సినిమాలు అంటే ఎగేసుకుంటూ వెళ్ళిపోతాము, అదే విధంగా ఈ సినిమాకి కూడా వెళ్ళండి, దయచేసి పెద్ద హిట్ చేయండి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా నాకు కంటెంట్ నచ్చితే ప్రమోట్ చేయడానికి ముందు ఉంటాను, నాకు ఈ సినిమా ట్రైలర్ చాలా బాగా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్.
Also Read : హరీష్ శంకర్ తో వెంకటేష్..మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటి!