Harish Shankar: ఇండస్ట్రీలో ఏ హీరో కి లేనటువంటి గొప్ప గుర్తింపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉంది. ఆయన చేసిన సినిమాలతో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తన వ్యక్తిత్వానికి కూడా అభిమానులైన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అతను ఎవరికైనా ఆపద వచ్చిందంటే చాలు వాళ్ళందరినీ ఆదుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్లే తనను చాలా మంది అభిమానిస్తూ,అనుసరిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే 2024 వ సంవత్సరంలో జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన ఆయన 21 సీట్లకు 21 సీట్లను గెలుచుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. నిజానికి ఇండస్ట్రీలో సైతం పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఉన్నారు. హరీష్ శంకర్, సుజిత్ లాంటి దర్శకులు సైతం పవన్ కళ్యాణ్ అభిమానులని ఓపెన్ గా చెప్పుకుంటూ ఉంటారు. ఇక హరీష్ శంకర్ సైతం తను కాలేజీలు చదువుకున్న రోజుల్లో ఫ్యాన్ వార్స్ జరిగేవని పవన్ కళ్యాణ్ ని ఒక వ్యక్తి ఒక టైం లో తక్కువ చేసి మాట్లాడితే అతని చెంప పగలగొట్టడానికి కూడా హరీష్ శంకర్ వెనకాడలేదని ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో హరీష్ తెలియజేశాడు.
మొత్తానికైతే హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని చెప్పాడు. అలాగే ఆయన సినిమాలను ఒకటికి పది సార్లు చూసే వాడినని గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. మొత్తానికైతే ఈ ఇన్సిడెంట్ బట్టి పవన్ కళ్యాణ్ అంటే హరీష్ శంకర్ కి ఎంతలా ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అభిమానులుగా మారిన వారెవరు అతన్ని వదిలేసి వెళ్లిపోవడం జరగదు.
ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ అభిమానులు గానే ఉంటారు తప్ప మరో హీరో కైతే షిఫ్ట్ అవ్వరు అంటూ చాలామంది సినిమా సెలబ్రిటీలు సైతం వాళ్ళ ఒపీనియన్స్ ను తెలియజేస్తుంటారు… పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. మరోసారి వీళ్ళ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వస్తోంది.
తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా కూడా పలు రికార్డులను బ్రేక్ చేస్తోంది అంటు దర్శకుడు హరీష్ శంకర్ గతంలో కొన్ని కామెంట్స్ చేశాడు. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. పవన్ కళ్యాణ్ రేంజ్ ను అమాంతం పెంచేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…