Harish Shankar Salman Khan Project Update: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రిలీజ్ అవ్వకముందు ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉండేవి. కానీ సినిమా రిలీజ్ అయి ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులందరు నిరాశ చెందారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులైతే తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యారనే చెప్పాలి. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు హరీష్ శంకర్, సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే సోషల్ మీడియా విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి. కానీ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో సల్మాన్ ఖాన్ సైతం హరీష్ శంకర్ ని పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ కి తెలుగులో ఏ స్టార్ హీరో కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ లైతే లేవు…ఇక మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇప్పటివరకు హరీష్ శంకర్ చేసిన సినిమాలన్నీ కమర్షియల్ హంగులతో రూపొందించినవే కావడం విశేషం…ఇకమీదట కూడా ఆయన నుంచి అలాంటి సినిమాలనే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి స్టార్ హీరోల కోసం వేచి చూడకుండా యంగ్ హీరోలతో సైతం ఆయన సినిమాలు చేస్తే అతనికి బాగా వర్కౌట్ అవుతుంది. గతంలో సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చేసిన ఆయన వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’ సినిమా అయితే చేశారు.
ఇక ఈ రెండు సినిమాల తరహాలో ఇప్పుడు కూడా వాళ్లనే పెట్టి మరోసారి డిఫరెంట్ సినిమాలను చేయాలనే ప్రయత్నం చేస్తాడా? లేదంటే మరోసారి స్టార్ హీరో డేట్స్ ఇచ్చేంతవరకు వెయిట్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం బాలయ్య సైతం హరీష్ చెప్పిన కథను రిజెక్ట్ చేశాడు అనే టాక్ నడుస్తుంది ఇది ఎంత వరకు నిజం అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది…