Nithiin Sharwanand Career Analysis: తెలుగు సినిమా ఇండస్ట్రీలో 20 సంవత్సరాలకు పైన సినిమాలను చేస్తూనే సక్సెస్ సాధించడానికి చాలా ఇబ్బందులు పడుతూ టాప్ పొజిషన్ కి వెళ్లలేక మీడియం రేంజ్ హీరోలు గానే మిగిలిపోయిన వాళ్ళలో నితిన్, శర్వానంద్ లు మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళు మొదట్లో భారీ సక్సెస్ లను సాధించి టాప్ హీరోలుగా మారుతారనే పేరును సంపాదించుకున్నప్పటికి అవేవీ వర్కౌట్ అయితే కాలేదు. కారణమేంటంటే వాళ్ళు చేసిన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు. దానికి తోడుగా వారి నుంచి వచ్చే ప్రతి సినిమా చాలా రొటీన్ గా ఉండడం వల్ల సగటు ప్రేక్షకులు కూడా వాళ్లను రిసీవ్ చేసుకోలేకపోయారు. అందువల్లే వాళ్ళు చాలా వరకు డీలా పడిపోయారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు మాత్రం డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు…
ఇప్పటికే వాళ్ళు టాప్ పొజిషన్లో ఉండాల్సిన హీరోలు… నిజానికి వీళ్ళు ఉండాల్సిన ప్లేస్ ని ఒక ఇద్దరు స్టార్ హీరోలైతే కబ్జా చేశారు. వాళ్లెవరూ అంటే అందులో ఒకరు నాని కాగా, మరొకరు విజయ్ దేవరకొండ… వీళ్ళు చేసిన సినిమాలను చాలా పకడ్బందీ ప్రణాళికలతో చేస్తూ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.
వాళ్ళు అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి టైర్ వన్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక వాళ్ళు అనుకుంటున్నట్టుగానే నాని విజయ్ దేవరకొండ టైర్ వన్ హీరోలుగా మారితే నితిన్, శర్వానంద్ సైతం టైర్ వన్ హీరోలవ్వడానికి పోటీ పడతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
శర్వానంద్ రీసెంట్ గా ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు బైకర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటే పర్లేదు…కానీ డీలా పడిపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది…