Homeఆంధ్రప్రదేశ్‌Venkaiah Naidu: ఆ బిజెపి నేత పై రగిలిపోతున్న వైయస్సార్ కాంగ్రెస్

Venkaiah Naidu: ఆ బిజెపి నేత పై రగిలిపోతున్న వైయస్సార్ కాంగ్రెస్

Venkaiah Naidu: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఓ జాతీయ నాయకుడి పై ఆగ్రహంగా ఉంది. ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత రాకుండా అడ్డుకోవాలని ఆ పార్టీ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. కానీ బిజెపిలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు అందుకు అడ్డుపడ్డారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి కూడా చట్టబద్ధత లేదు. కానీ ఏపీ రాజధాని అమరావతికి మాత్రం కచ్చితంగా ఉండాల్సిందేనని వెంకయ్య నాయుడు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ స్థాయిలో ఆయన లాబీయింగ్ చేయడం వల్లే వేగంగా చట్టబద్ధత అనే అంశం పట్టాలెక్కింది. అయితే రకరకాల అంశాలను పెట్టి ఈ ప్రక్రియను జాప్యం చేయాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లేశారు వెంకయ్య నాయుడు.

* జాప్యం చేయాలనే ప్రయత్నం..
అమరావతి రాజధానికి ( Amravati capital) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అమరావతికి వ్యతిరేకం అనే మాట చెప్పలేకపోతోంది ఆ పార్టీ. కానీ అమరావతి విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి ఎంత మాత్రం సుముఖంగా లేవు. ముఖ్యంగా చట్టబద్ధత విషయంలో అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే ఆ పార్టీ అమరావతి రైతుల కోణంలో కొన్ని రకాల అంశాలను తెరపైకి తేవాలని చూసింది. అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని.. వారి సమస్యలు పరిష్కరించిన తర్వాత మాత్రమే అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చింది. వాస్తవానికి చట్టబద్ధత అనే అంశం ఇప్పట్లో ఉండదు అని భావించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది.

* వెంకయ్య నాయుడు ఎంట్రీ తో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిజెపిలో పాత స్నేహితులు ఉన్నారు. వారి ద్వారా ఈ చట్టబద్ధత ప్రక్రియ అడ్డుకునే పని చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిని గ్రహించిన చంద్రబాబు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు( venkaiah Naidu ) సేవలను వినియోగించుకున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఎప్పటికప్పుడు ప్రత్యుత్తరాలు జరుపుతూ.. అందుకు అవసరమైన అన్ని వివరాలను అందించగలిగారు. అందుకే ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ ముందుకు చట్టబద్ధత ఫైల్ చర్చకు రానుంది. అక్కడ నుంచి నేరుగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత అడ్డు తగిలినా ఆగే పరిస్థితి లేదు. అయితే దీనంతటికీ కారణం వెంకయ్య నాయుడు అని ఆగ్రహంగా ఉందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. విపరీతమైన ప్రచార ఆకాంక్షతోనే వెంకయ్య నాయుడు ఉన్నారు అంటూ తన సొంత మీడియాలో రాయించుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆది నుంచి వెంకయ్య నాయుడు తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే మాదిరిగా ఉండేది. ఇటీవల వెంకయ్య నాయుడు సైతం వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలు, నేతల వ్యవహార శైలి పై తరచూ మాట్లాడుతుంటారు. మొత్తానికైతే వెంకయ్య నాయుడు పరిస్థితి చూస్తుంటే మాత్రం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా మారిపోయారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version