Homeఎంటర్టైన్మెంట్Harish Shankar Maruthi trolling: హరీష్ శంకర్ - మారుతి లను ఆడుకుంటున్న నెటిజన్లు...

Harish Shankar Maruthi trolling: హరీష్ శంకర్ – మారుతి లను ఆడుకుంటున్న నెటిజన్లు…

Harish Shankar Maruthi trolling: స్టార్ హీరోలతో సినిమాలు చేయడమంటే ఆషామాషీ వ్యవహారమైతే కాదు. వాళ్ళ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యాన్స్ ని అంచనా వేస్తూ వాళ్లతో ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే ధోరణిలో క్రాస్ చెక్ చేసుకుని మరి సినిమాలు చేయాలి. అందులో ఏమాత్రం తేడా జరిగినా కూడా ఆయా హీరోల అభిమానుల నుంచి భారీ విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయా సినిమాల విషయంలో ఎలాంటి తేడా జరిగిన కూడా మిగతా స్టార్ హీరోలు సైతం ఆ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించరు. చిన్న హీరోలతో మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమాలను చేస్తే పర్లేదు. కానీ స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్…

ఇక ఈ విషయంలో హరీష్ శంకర్ – మారుతి ఇద్దరు కూడా తడబడ్డారు. మారుతి ప్రభాస్ తో చేసిన రాజాసాబ్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో డైరెక్టర్ మారుతి పైన తీవ్రమైన విమర్శలైతే వచ్చాయి. ఇక ప్రభాస్ అభిమానులు మారుతిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో, ఇన్ స్టాలో విపరీతమైన నెగెటివ్ పోస్టులను పెట్టారు. దాంతో దెబ్బకు మారుతి సైలెంట్ అయిపోయాడు.

ప్రస్తుతం ఆయన ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే విషయంలో కూడా సరైన క్లారిటి లేకుండా పోయింది… రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. హరీష్ శంకర్ గతంలో పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.

అదే తరహాలో ఈ మూవీ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేశాడు. కానీ అది అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాలేదు… దాంతో హరీష్ శంకర్ ని సైతం పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.. హరీష్ శంకర్ ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడనే విషయంలో కూడా సరైన క్లారిటి రావడం లేదు…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular