Crocodiles Raja Saab Theater: అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. తెలుగు, తమిళ సినిమాల్లో ఫ్యాన్స్ సందడి ఎక్కువగా ఉంటుంది. తెలుగులో చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, బన్నీ, రామ్‌చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఫ్యాన్స్ చర్చ చేస్తారు. తాజాగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సిరిమా రిలీజ్ అయింది. సంక్రాంతి రేసులో అనేక సినిమాలు ఉన్నాయి. మొదటి సినిమా రాజాసాబ్ జనవరి 9న విడుదలైంది. మార్నింగ్ షోలో.. ప్రభాస్ అభిమానులు హంగామా చేశారు.
మొసలితో రచ్చ..
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ మొసలిలో ఫైట్ సీన్ ఉంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఓ థియేటర్‌కు ఏకంగా మొసలినే పట్టుకొచ్చారు. అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. రచ్చ చేశారు. స్క్రీన్‌పై హీరో ఎంట్రీ, యాక్షన్ సీన్స్, డైలాగ్‌లకు డప్పులు కొట్టి, చప్పట్లు మోగించి, రెబల్ స్టార్.. రెబల్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. అభిమానుల నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.
వీడియో వైరల్..
ఓ థియేటర్‌లోకి ప్రభాస్ అభిమానులు మొసలిని తెచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గంటల వ్యవధిలోనే వేల వ్యూస్ వచ్చాయి. ఇక కొందరు అభిమానులు అట్లుంటది ప్రభాస్ అభిమానులతోని అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే రాజాసాబ్ ప్రీ రిలీజ్‌తోనే హైప్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని గంటల్లోనే లక్షల లైకులు, షేర్‌లు వచ్చాయి. నెటిజన్లు ‘సూపర్ ఎంట్రీ‘, ‘ఫ్యాన్స్ పవర్‘ అంటూ కామెంట్లు పెడుతూ సినిమా విజయాన్ని ముందుగా ప్రకటించారు.
Orey Mental Rebels….#TheRajaSaab
— cinee worldd (@Cinee_Worldd) January 8, 2026