Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్ భారీ హిట్. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. గబ్బర్ సింగ్ హిందీ మూవీ దబంగ్ రీమేక్. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లు హరీష్ శంకర్ భారీ మార్పులు చేశారు. గబ్బర్ సింగ్ ఒరిజినల్ మూవీ వలె ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ మేనరిజం, హరీష్ శంకర్ రాసిన వన్ లైనర్స్ అద్భుతంగా ఉంటాయి. గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అత్యంత ప్రత్యేకంగా మారింది.
అప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డారు. గబ్బర్ సింగ్ మూవీతో పవన్ కళ్యాణ్ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో మూవీ రావాలని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తో వారి కోరిక నెరవేరనుంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం అవుతుంది. కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్స్ కి ఆయన సమయం కేటాయిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో ఆయన తిరిగి అడుగుపెట్టలేదు. అందులోనూ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీతో భారీ ప్లాప్ ఖాతాలో వేసుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందా లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో హరీష్ శంకర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
హరీష్ శంకర్ ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కి సంబంధించిన ఒక సన్నివేశం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పెట్టాను, అన్నారు. ఆ సన్నివేశం ఆయన కోసం రాశాను. హరీష్ లీక్స్ అనుకోండి.. అంటూ క్రేజీ మేటర్ బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ నిజ జీవితానికి సంబంధించిన ఆ పొలిటికల్ సీన్ ఏమిటనే చర్చ మొదలైంది. ఇక సదరు సన్నివేశం పవన్ కళ్యాణ్ అభిమానులకు ట్రీట్ అనడంలో సందేహం లేదు.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది.