Aadabidda Nidhi Scheme: ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం( alliance government ). ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేయడం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచింది. అటు తరువాత అన్న క్యాంటీన్లను తెరిచింది. గత ఏడాది దీపావళి నాడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించింది. అయితే ఆ మూడు చేసినా ప్రజల్లో సంతృప్తి కనిపించలేదు. ఆ మూడు హామీలు సూపర్ సిక్స్ పథకంలో ఉన్నవే. అయితే ఈ ఏడాది తల్లికి వందనం పథకం అమలు చేసింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేసింది. అన్నదాత సుఖీభవ అమలు చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించనుంది. అయితే ఇలా మొత్తం పథకాలు అమలవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పై ఆర్థిక భారం పడుతోంది. అదే సమయంలో విపక్షాలు ఈ పథకాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నారు. మిగతా పథకాల మాట ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు పథకాలు అమలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే.. ఈ సరికొత్త డిమాండ్లపై రుసరసలాడుతున్నారు ఏపీ మంత్రులు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలకమైన ఓ పథకం విషయంలో నోరు జారారు.
ప్రధాన ఎన్నికల హామీగా..
టిడిపి ( Telugu Desam Party) కూటమి అధికారంలోకి వస్తే ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానమైనదిగా చెప్పుకొచ్చారు. ఆడబిడ్డ నిధి పథకం కింద ఈ సాయాన్ని ఏడాదికి 18 వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పట్లో వైసిపి ప్రభుత్వం మహిళలకు ఏడాదికి 18 వేల రూపాయలు అందించిన సంగతి తెలిసిందే. దానికి పూర్తిగా టిడిపి ఎన్నికల్లో ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింప చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే దీనిపై తాజాగా స్పందించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఏపీ ని అమ్మాల్సి ఉంటుందని అన్నారు. ఓ బహిరంగ సభలో ఈ ప్రకటన చేయడంతో అక్కడ ఉన్న వారు షాక్ కు గురయ్యారు. అయితే ఇంతలోనే చేరుకున్న ఆయన ఒక్కసారిగా నవ్వేయడంతో అక్కడ నవ్వులు విరిసాయి.
Also Read: పరుపు, దిండు, ఓ దోమతెర.. జైల్లో మిథున్ రెడ్డి కోరికల చిట్టా
పి4 లో విలీనం..
అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. పేదరిక నిర్మూలన కోసం పి4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత నిరుపేద కుటుంబాలను పైకి తేవాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేశారు. ఆర్థికంగా ఉన్నవారు.. నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఆ పథకంలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని విలీనం చేసి అమలు చేస్తామని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే మార్గదర్శకుల రూపంలో ఉన్నతశ్రేణి వర్గాల నుంచి సాయం తీసుకుని.. నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలన్నదే దీని ప్లాన్. అయితే ఇలా దత్తత తీసుకున్న నిరుపేదల కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఆ నిధుల సర్దుబాటుకు నిర్ణయించారు. అయితే రాష్ట్ర క్యాబినెట్ లోని ఓ మంత్రి ఇలా పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని అనడం మాత్రం విస్తు గొలుపుతోంది. అటువంటిప్పుడు హామీ ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఆడవాళ్లకు నెలకు రూ.1500 ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలి – మంత్రి అచ్చెన్నాయుడు pic.twitter.com/h6kK2ibqEX
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2025