Allu Arjun become a star hero : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి క్రేజీ అయితే దక్కుతోంది. ముఖ్యంగా వరుస సక్సెస్ లతో సక్సెస్ లను సాధిస్తూ ఎవరైతే ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటారో వాళ్లకి ఎక్కువ మార్కెట్ ఉండడమే కాకుండా క్రేజ్ కూడా భారీగా పెరుగుతోంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా మంచి సినిమాలను చేస్తుండటం విశేషం…బాలీవుడ్ హీరోలకు పోటీగా పుష్ప 2 (Pushpa 2) సినిమాతో పెను రికార్డు లను సృష్టించిన ఆయన తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. కెరియర్ స్టార్టింగ్ నుంచి మంచి సినిమాలను చేసుకుంటూ వస్తున్న అల్లు అర్జున్ మొదట్లో డాన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి తను మంచి డాన్సర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన ఎప్పుడో స్టార్ హీరోగా ఎదగాల్సింది. కానీ ఆయన అలా ఎదగకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆయన కథల్లో పెద్దగా డెప్త్ అయితే లేకుండా పోయింది. లైట్ వెయిట్ కథలతో సినిమాలను చేయడం వల్లే ఆయన సక్సెస్ అయితే సాధించారు. కానీ హెవీ వెయిట్ ఉన్న సినిమాలను చేయలేడు అనే ఒక అపవాదనైతే మోసాడు. ఇక చాలా సంవత్సరాల నుంచి ఆయన అలాంటి సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. మొత్తానికైతే పుష్ప 2 (Pushpa 2) సినిమాతో స్టార్ హీరోగా మారడమే కాకుండా పాన్ ఇండియా రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు.
అందువల్లే ఆయన స్టార్ హీరోగా మారిపోయాడు. నిజానికి ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. మరి దానికి అనుగుణంగానే ఆయన మంచి సబ్జెక్టులను ఎంచుకోవడం మంచి దర్శకులతో సినిమాలను చేసి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నాడు.
Also Read : అల్లు అర్జున్, అట్లీ మూవీ గురించి సంచలన అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే!
ఇక ప్రస్తుతం అట్లీ(Atlee) తో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక కథ విషయంలో ఆయన చాలా క్లారిటీతో ఉన్నాడు. ముఖ్యంగా కథలో కొన్ని మార్పులు చేయమని అట్లీకి సూచించినట్టుగా తెలుస్తోంది.
మరి ఆ మార్పుల వల్ల కథ ఇంకాస్త డెప్త్ గా మారుతుంది అనే ఉద్దేశ్యంతోనే ఆయన కొన్ని మార్పులను సూచించినట్టుగా తెలుస్తోంది. మరి అట్లీ కూడా వాటికి కాంప్రమైజ్ అయి కథని కొంచెం మార్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు అనేది మాత్రం వాస్తవం…