Hari Hara Veeramallu : ఐదేళ్ల క్రితం మొదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని గత నెలలోనే విడుదలకు సిద్ధమైంది. కానీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలన్స్ ఉండడం వల్ల చివరి నిమిషం లో వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ చిత్రం ఈ నెల 24 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని మేకర్స్ నేడు ఉదయం 11 గంటల 10 నిమిషాలకు విడుదల చేశారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఇది అసలు మా సినిమానేనా అని ఆశ్చర్యపోతూ, మరోపక్క సంతోషిస్తూ పోస్టులు వేస్తున్నారు. ఈ మాత్రం చాలు పవన్ కళ్యాణ్ మార్క్ ఓపెనింగ్స్ రావడానికి అని రిలాక్స్ అవుతున్నారు.
ఇకపోతే ఈ ట్రైలర్ విడుదలై కేవలం ఆరు గంటలు మాత్రమే పూర్తి అయ్యింది. ఈ ఆరు గంటల్లో అన్ని భాషలకు కలిపి 25 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది. తెలుగు వెర్షన్ లో ఇప్పటి వరకు 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హిందీ వెర్షన్ 7 మిలియన్ వ్యూస్ దాటాయి. అదే విధంగా తమిళం , కన్నడం మరియు మలయాళం భాషలకు కలిపి మరో 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగు వెర్షన్ లో లైక్స్ ఇప్పటి వరకు 4 లక్షల వరకు వచ్చింది. 24 గంటలు గడిచిన తర్వాత లైక్స్ సంఖ్య 9 లక్షలకు చేరే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈమధ్య కాలం లో ఒక పాన్ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ లైక్స్ రావడం ఎప్పుడూ జరగలేదట. నిజమైన రీచ్ కి ఇదే నిదర్శనం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ట్రైలర్ విడుదలకు ముందు ఈ సినిమా పై ఉన్న అంచనాలు అంతంత మాత్రమే అనేది వాస్తవమే. ఎందుకంటే 5 ఏళ్ళ నుండి సెట్స్ మీద ఉన్న సినిమా. డైరెక్టర్ మారిపోయాడు, టెక్నీషియన్స్ మారిపోయాడు, పవన్ కళ్యాణ్ లుక్స్ మారిపోయాయి. ఈ సినిమా పరిస్థితి ఏంటో, పాపం నిర్మాత AM రత్నం వందల కోట్లు ఖర్చు చేసాడు,ఆయన్ని ఆ దేవుడే కాపాడాలి అంటూ చాలా మంది జాలి చూపించారు. కానీ ఒకే ఒక్క ట్రైలర్ అందరి దృష్టిని మార్చేసింది. ఇది కదరా మేము కోరుకున్నది అంటూ అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేసింది. సోషల్ మీడియా లో కూడా ఈ ట్రైలర్ రీచ్ మామూలు రేంజ్ లో లేదు. ప్రముఖ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కూడా ఈ ట్రైలర్ పై కామెంట్స్ చేస్తుండడం తో రీచ్ బాగా పెరిగిపోతూ వెళ్తుంది. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
https://www.youtube.com/watch?v=Qv-NEQJehVU
