Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా జులై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఆసక్తిగా ఆకట్టుకునే విధంగా ఉంది. చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే విషయం కూడా ఈ ట్రైలర్ ద్వారా మనకు తెలియజేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను చేసిన డైరెక్టర్ క్రిష్ (Krish) మధ్యలో ఈ సినిమా నుంచి వెళ్ళిపోవడం అనేది సినిమాకు భారీగా మైనస్ గా మారిందనే చెప్పాలి. ఇక ఆయన సినిమా నుంచి తప్పుకున్న తర్వాత ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన ఎ ఏం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ (Jyothi Krishna) ఈ సినిమాని డైరెక్షన్ చేశాడు. ఇక ఆయన సారధ్యంలోనే ఈ సినిమా రిలీజ్ కూడా అవుతోంది… ఈ సినిమా ట్రైలర్ ని కనక మనం చూసినట్లయితే చాలా చోట్ల సీజీ వర్క్ అనేది ఈజీగా తెలిసిపోతుంది…చాలా సీన్స్ ను గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి ఆ తర్వాత సిజి వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిలో హైనాతో అరిచే షార్ట్ కూడా సీజీ అనేది మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది…క్రిష్ కనక ఈ సినిమా డైరెక్షన్ చేసి ఉంటే సీజీ వర్క్ ని చాలా సెన్సిటివ్ గా డీల్ చేసేవాడు. అది సిజి అనే విషయం కూడా మనకు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని మరి చాలా ప్రెస్టేజ్ గా సినిమాని చేసేవాడు.
Also Read: ఓజీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది అప్పుడేనా..? ట్రైలర్ వచ్చే డేట్ ను లాక్ చేసిన ప్రొడ్యూసర్…
గతంలో బాలయ్య బాబు(Balayya Babu) తో చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి (Gouthami Putra Shathakatni) సినిమాలో చాలావరకు సీజీ షాట్స్ అయితే ఉంటాయి. కానీ అవి ఏవి మనకు సీజీ అని తెలిసేలా ఉండవు. ఈ సినిమా నుంచి తప్పుకోవడం అనేది ఈ సినిమాకి చాలా వరకు మైనస్ గా మారిందనే చెప్పాలి.
ఒక రకంగా పవన్ కళ్యాణ్ చరిష్మాని కూడా ఈ సినిమాలో అంత ఎఫెక్టివ్ గా చూపించలేదనే విషయం కూడా తెలిసిపోతోంది. మరి ఈ సినిమా మొత్తం చూస్తే గాని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలైతే లేవు. కానీ ట్రైలర్ లో మాత్రం పవన్ కళ్యాణ్ ని ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా ప్రజంట్ చేసుంటే బాగుండేది అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా చాలా రోజుల తర్వాత రిలీజ్ కి సిద్ధమవుతోంది. కాబట్టి ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల ఆయన ఈ సినిమా ద్వారా ఎలాంటి ఇమేజ్ ను పొందుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…