Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ మొదటి నుండే ఈ చిత్రం పై తక్కువ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఆరేళ్ళు ఆలస్యం అయ్యింది. డైరెక్టర్ మారిపోయాడు, సినిమా చాలా అవుట్ డేటెడ్ అనే ఫీలింగ్ రావడం తో ఫ్యాన్స్ లో ఆశలు సన్నగిల్లాయి. ఎలాగో రెండు నెలల్లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న ఓజీ చిత్రం విడుదల అవ్వబోతుంది కాబట్టి, ఈ సినిమాని లైట్ తీసుకుందాం అనే మోడ్ లోకి వెళ్లిపోయారు. అయితే సినిమా కంటెంట్ వరకు ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ నుండి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవ్వలేదు కానీ, VFX మీద మాత్రం దారుణమైన కంప్లైంట్స్ వచ్చాయి.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే VFX షాట్స్ గురించి ఎంత వర్ణించినా తక్కువే. అంత దారుణంగా ఉన్నాయి. కేవలం ఈ VFX షాట్స్ వల్లనే ఈ సినిమాకు జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది అని అనొచ్చు. అయితే సోషల్ మీడియా లో ఫ్యాన్స్ నుండి వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని తీసుకున్న మూవీ టీం సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చెయ్యాలని నిర్ణయించుకుందట. 15 నిమిషాల నిడివి వరకు ఆ సన్నివేశాలు ఉంటాయని టాక్. ఈరోజు సాయంత్రం షోస్ నుండే హైదరాబాద్ లో ఇది రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకుంటారట. రేపటి నుండి ప్రపంచవ్యాప్తంగా తొలగించిన ఆ సన్నివేశాలతోనే సినిమా అందుబాటులో ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ సన్నివేశాలను కత్తిరించిన తర్వాత ఈ చిత్రానికి జనాల్లో పాజిటివ్ టాక్ పెరుగుతుందా లేదా అనేది. అయితే విశ్లేషకులు మాత్రం జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే జరిగిపోయిందని, ఇక చేసేది ఏమి లేదని అంటున్నారు.