Hari Hara Veeramallu Success Meet : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం నిన్న రాత్రి ప్రీమియర్ షో ద్వారా భారీ లెవెల్ లో విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అసలే అభిమానులు సినిమా ఫ్లాప్ అయ్యింది అనే బాధలో ఉంటే, మేకర్స్ పుండుమీద కారం చల్లినట్టు సాయంత్రం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఎందుకో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని చాలా వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఆయన ఇన్నేళ్ల కెరీర్ లో ఈ చిత్రానికి ప్రచారం చేసినట్టు, ఏ సినిమాకు కూడా చెయ్యలేదు. నిన్న రాత్రి వరకు కూడా ఈ సినిమాకు ఫైనాన్సియల్ క్లియరెన్స్ రాలేదు. అప్పుడు కూడా ఆయన మధ్యలో కలగచేసుకొని ఫైనాన్సియల్ లావీదేవిలు సెటిల్ చేశాడు. ఇప్పుడు సక్సెస్ మీట్ లో కూడా ఆయన పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘మీడియా మిత్రులు క్షమించాలి..ఈరోజు సీఎం గారితో క్యాబినెట్ మీటింగ్ ఉండడం , ఆ తర్వాత వరుసగా రివ్యూ మీటింగ్స్ ఉండడం వల్ల నేను రెండు గంటలు ఆలస్యంగా రావాల్సింది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు పంచాయితీ రాజ్ శాఖ గురించి చర్చలు చేసి, ఆ తర్వాత కొన్ని పంచాయితీలు చేయాల్సి వచ్చింది. కానీ ఒక సినిమా రిలీజ్ విషయం లో కూడా నేను తలదూర్చి పంచాయితీలు చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితం లో ఈ సినిమాకు చేసినంత ప్రచారం ఏ సినిమాకు కూడా చెయ్యలేదు. నాకు ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదు’ అంటూ కామెంట్స్ చేశాడు. అదే విధంగా ఔరంగజేబు గురించి చూపించినందుకు చాలా మంది ఫీల్ అయ్యారు అని తెలిసిందని, ఎంతసేపు మొఘల్ సామ్రాజ్యం గొప్పది, అందులో ఉన్నోళ్లు గొప్పోళ్ళు అని చూపించడమే కానీ, వాళ్ళు చేసిన అకృత్యాల గురించి ఎవ్వరూ చూపించలేదని, అందుకే మేము ఆయనలోని డార్క్ షేడ్స్ ని చూపించమని చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియా లో ట్రోల్స్ గురించి మాట్లాడుతూ ‘నా అభిమానులు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళు తిట్టేది నన్ను కదా మీరెందుకు బాధపడతారు మీరు జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండయ్యా అంత సున్నితంగా ఉండకండి. ప్రతీ సోషల్ మీడియా కామెంట్ కి నలిగిపోకండి. మీ దమ్ముంటే తిరిగి కొట్టండి , ఎలా దాడి చెయ్యాలో అలా చెయ్యండి. నెగటివ్ చేసే వాళ్ళని కొట్టి తరిమేయండి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో సంచలనంగా మారాయి. ఇంకా ఈ ఈవెంట్ లో ఏమి మాట్లాడాడో మీరే చూసి చెప్పండి.
#PawanKalyan's Message to His Fans
"వాళ్ళు తిట్టేది నన్ను కదా మీరెందుకు బాధపడతారు మీరు జీవితాన్ని Enjoy చెయ్యండయ్యా అంత సున్నితంగా ఉండకండి"#HariHaraVeeraMallu pic.twitter.com/hw91jiiVmj
— Daily Culture (@DailyCultureYT) July 24, 2025